వంట గ్యాస్ ధర రూ. 1800, లీటరు పెట్రోలు రూ.170
ఇంఫాల్ : అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపుర్‌లో నిత్యావరసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటున్నాయి. అల్ల ర్ల వల్ల చోటుసుకుంటున్న ఉద్రిక్తతలతో నిత్యావసరాల ధరలే కాదు.. కలోగంజో కాసుకుని కడుపు నింపుకుందామంటే వంట గ్యాస్ ధర కూడా మండిపోతోంది. మణిపూర్‌లో వంటగ్యాస్ సిలిండర్ రూ.1800 అమ్ముతోంది. నిత్యావసరాలు లేక ఇబ్బందులు పడుతున్న జనాలు అధిక ధరలు చెల్లించి కొద్దో గొప్పో కొనుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ట్రక్కులతో తరలిస్తున్నా డిమాండ్ కు తగిన సరఫరా లేకపోవటంతో నిత్యావసరాలు రాష్ట్రంలో ప్రజలకు ఏమూలకు సరిపోవటంలేదు. దీంతో ధరలు ఆకాశాన్నంటున్నాయి. రాష్ట్ర రాజధాని ఇంఫాల్ తూర్పు, పశ్చిమ లోయ సహా పలు ప్రాంతాల్లో బియ్యం, బంగాళదుంప, ఉల్లిగడ్డ, కోడిగుడ్ల ధరలు అత్యధికంగా పెరిగిపోయాయి. 50కిలోల బియ్యం ధర ఒక్కసారిగా పెరిగిపోయి రూ.900 అమ్ముతోంది. వంట గ్యాస్ ధర రూ.1800లకు చేరింది. దీంతో ప్రజలు నానా పాట్లు పడుతున్నారు. కొనలేకపోతున్నామని.. కానీ కొనక తప్పటంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంటగ్యాస్ సిలిండర్ల సరఫరా ఆగిపోవడంతో బ్లాక్‌మార్కెట్ విపరీతంగా పెరిగిపోయింది. అదేమని అడిగితే అదీ దొరకే పరిస్థితి లేదు. దీంతో ఒక్కో గ్యాస్ సిలిండర్ ధర రూ.1800లకు పైనే అమ్ముతోంది. ఇంఫాల్‌లోని పలు ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.170 అమ్ముతున్నారు.అదేమంటు సరఫరాలేదంటున్నారు. ఒక్కో కోడిగుడ్డు ధర రూ.10, కిలో బంగాళాదుంపల ధర రూ.100.. దీంతో జనాలు అల్లాడిపోతున్నారు. సాధారణ పరిస్థితులు ఎప్పుడొస్తాయోనని ఆశగా వేచి చూస్తున్నారు. కాగా మణిపూర్‌లో అల్లర్లు చెలరేగి పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోయింది. రాజధానికి ట్రక్కుల రాక ఆగిపోయింది. కానీ రెండు వారాల కంటే కాస్త ఇప్పుడు అంత ఉద్రిక్తతలు నియంత్రించబడ్డాయి. ఎన్‌హెచ్ 37లో ట్రక్కుల కదలిక మే 15న ప్రారంభమైందని.. భద్రతా బలగాలు పూర్తి సాధారణ స్థితిని పునరుద్ధరించేందుకు యత్నిస్తున్నారని అధికార ప్రతినిధి తెలిపారు. మెయిటీ,కుకీ కమ్యూనిటీ ప్రజల మధ్య హింస కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ అల్లర్లకు 70మంది ప్రాణాలు కోల్పోయారు.పెద్ద సంఖ్యలో ఉన్న మెయిటీ వర్గం ప్రజలను షెడ్యూల్డు తెగల కేటగిరీలోకి తేవాలనే డిమాండ్‌ను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చెలరేగింది. దీనికి ది ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ మణిపూర్ నాయకత్వం వహిస్తోంది.
మండిపోతున్నమణిపూర్…
RELATED ARTICLES