ప్రజాపక్షం/హైదరాబాద్ శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా ఎంఎల్‌సి బండ ప్రకాశ్ ముదిరాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయన ఎన్నికను
ఆదివారం నాడు శాసనమండలి సమావేశంలో ప్రకటించారు. ఈ సందర్భంగా బండ ప్రకాష్‌ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అభినందించారు. సాదరంగా ఆహ్వానించి చైర్‌లో కూర్చోబెట్టారు. పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సిఎం కెసిఆర్ మాట్లాడుతూ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా బండ ప్రకాశ్ ఏకగ్రీవంగా ఎన్నికవడం తమకెంతో ఆనందదాయకమని తెలిపారు. ఉన్నత విద్యావంతుడిగా వరంగల్ జిల్లా వాసిగా సుపరిచితుడని అన్నారు. ముదిరాజ్ సామాజిక అభ్యన్నతికి బండ ప్రకాష్ చేసిన కృషి అభినందనీయమన్నారు. 1969 తెలంగాణ ఉద్యమంలో విద్యార్థిగా బండ ప్రకాష్ కీలకపాత్ర పోషించారన్నారు. నూతన రాష్ట్ర పునర్నిర్మాణంలో బండ ప్రకాష్ పాత్ర కీలకమైనదని, డిప్యూటీ ఛైర్మెన్‌గా శాసనమండలిని సమర్థమతంగా నడిపించాలని కోరుకుంటున్నానని సిఎం కెసిఆర్ అన్నారు. మండలి డిప్యూటీ ఛైర్మెన్‌గా ఎన్నికైన బండ ప్రకాష్‌ను మంత్రి కెటిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన అనుభవం సభకు ఉపయోగపడుతుందన్నారు. బండ ప్రకాష్‌కు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్ ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎం.పి. వద్దిరాజు రవిచంద్ర, ఎంఎల్‌సి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఎంఎల్‌ఎలు తాటికొండ రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, ముత్తిరెడ్డి యాదిగిరి రెడ్డి, ఆరూరి రమేశ్, పెద్ది సుదర్శన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
మండలి డిప్యూటీ చైర్మన్‌గా బండ ప్రకాష్ ఏకగ్రీవ ఎన్నిక
RELATED ARTICLES