ప్రజాపక్షం/హైదరాబాద్ రాష్ట్ర బడ్జెట్ భ్రమలను కల్పిస్తోందని సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. పన్నుల ఆదాయం రూ. 93 వేల కోట్ల నుంచి రూ లక్షా 8 వేల కోట్లకు పెంచి ప్రజలపై భారాలు వేయనున్నారని ఆయన సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏడేళ్లు గడిచినప్పటికీ ఇంటి సమస్య, దళితులు మూడు ఎకరాల భూమి, అందరికీ వైద్యం, విద్య సౌకర్యాన్ని కల్పించలేదని ఆరోపించారు. స్వంత స్థలంలో ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు ఇస్తామని, కేవలం రూ.3 లక్షలను మాత్రమే బడ్జెట్‌లో ప్రతిపాదించడం సరైంది కాదన్నారు. బడ్జెట్‌లో దళిత, గిరిజన, బిసి, మహిళ, విద్యారంగానికి భారీగా కేటాయింపులు చూపుతున్నప్పటికీ ఆచరణలో తగ్గిస్తున్నారని ఆరోపించారు. దళిత, గిరిజనులకు కేటాయించిన బడ్జెట్ నిధులను, సబ్ ప్లాన్ నిధులను ఒక చోట చేర్చి, నోడల్ ఆఫీసర్‌ను నియమించి వారి అభివృద్ధికి ఖర్చు చేయాలని, బడ్జెట్ ప్రతిపాదనలను సవరించాలని ఆయన డిమాండ్ చేశారు.
భ్రమలు కల్పిస్తోంది
RELATED ARTICLES