ప్రజాపక్షం/హైదరాబాద్: పేదలకు భూ పంపిణీ, సంక్షేమ పథకాలు, ఉపాధి హామీ చట్టం సక్రమంగా అమలు కోసం పోరాటాలకు సిద్ధం కావాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపాముల వెంకట్రాములు పిలుపునిచ్చారు. సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం హిమాయత్‌నగర్‌లోని రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. కలకొండ కాం తయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వెంకట్రాములు మాట్లాడుతూ భూమి లేని పేదలకు భూములు పంపిణీ చేయడంలో ప్రభుత్వం విఫలమయ్యిందన్నారు. సాగు భూమి కోసం, పోడు భూముల పట్టాల కోసం, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం రానున్న కాలంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలకు సిద్ధం కావాలన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని అమలు పరచటంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ చట్టానికి తూ ట్లు పొడవడం ద్వారా నర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర తోమర్ ఉపాధి హామీ పథకం ఎంతో కాలం కొనసాగించలేమని ఇటీవల పార్లమెంటు సమావేశాల్లో చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
భూ పంపిణీ కోసం పోరాటాలకు సిద్ధం
RELATED ARTICLES