నిమ్జ్ ప్రాజెక్టుకు తమ భూములు లాక్కున్నారని బాధితుల ఆందోళన
పరిహారం చెల్లించలేదని మండిపాటు
ప్రజా పక్షం / జహిరాబాద్ జాతీయ పెట్టుబడులు ఉత్పాదక మండలి (నిమ్జ్) ప్రాజెక్టులో రూ. 1000 కోట్ల పెట్టుబడితో 550 ఎకరాల్లో నీమ్జ్ టెక్నాలిజీస్ ప్రైవేట్
లిమిటెడ్ కంపినీకి ఐటి శాఖ మంత్రి కెటిఆర్ బుదవారం శంఖుస్తాపన చేసిన నేపథ్యంలో నిమ్జ్ భూ నిర్వాసితులు, భూములు కోల్పోయిన రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులు గంగ్వార్ వద్ద లాఠీచార్జీ చేశారు. లాఠీ చార్జ్ చేయడంతో పలువురు మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. వారిని హుటా హుటిన పోలీసులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు లాఠీచార్జీ చేయడంతో వివిధ గ్రామాల ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కోపోద్రేకులయ్యారు. ఝురాసంఘం మండలంలోని ఎల్గొయి, బర్దిపూర్ చిల్లిపలి,్ల న్యాల్ కాల్ మండంలోని ముంగి, ముంగి తాండా, హద్నూర్ రేజింటల్, మొల్కలపాడు, మిర్జాపూర్ (సి) మాల్కాపూర్ గంజాటీ, రుక్మాపూర్ తాండ ,రామతీర్థం తదితర గ్రామాలను పూర్తిగా పోలీసులు గత రెండు రోజల నుండి వారి అధీనంలోకి తీసుకున్నారు. ఎక్కడికక్కడ రైతులను కట్టడి చేశారు. రైతులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో భూనిర్వాసితులు మాట్లాడుతూ తమ భూములను బలవంతంగా లాక్కొని నష్టపరిహారం చెల్లించకుండా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నారని తమ సమస్యలను మంత్రికి తెలియజేయడానికి వస్తే విచక్షణ రహితంగా లాఠీ చార్జీ చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండు రోజులుగా పోలీసులు గ్రామాలను పహారా కాసారని గ్రామస్థులను బయటకు వెళ్లకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని భూ నిర్వాసితులు చెప్పారు. ఇదిలా ఉండగా గత రెండు రోజులుగా వివిధ గ్రామాల్లో హోటళ్లను, కిరాణ షాపులను సైతం పోలీసులు మూసివేయించారు. జహిరాబాద్ నుండి మధున్నూర్ బర్దిపూర్ క్రాస్ రోడ్డు నుండి నిమ్జ్ ప్రాంతం వరకు అడుగడుగునా పోలీసులు తనిఖీలు నిర్వహించారు. రైతులను సైతం పొలాలకు వెళ్లనివ్వకుండా కట్టడి చేశారు. గంగ్వార్ వద్ద పోలీసులు రైతులు గ్రామస్తులపై లాఠీచార్జీ చేసి భయానక వాతావరణం సృష్టించారు. దీంతో భూమి నిర్వాసితులు అరచేతిలో ప్రాణం పెట్టుకుని పరుగులు తీసారు. పోలీసులు మహిళలని కూడా చూడకుండా విచక్షణ రహితంగా లాఠీ చార్జీ చేయడాన్ని పలు రాజకీయ పార్టీల నాయకులు తీవ్రంగా ఖండించారు. ఇంత జరిగినా మంత్రి కెటిఆర్ భూనిర్వాసితులను పిలిచి వారితో మాట్లాకుండా వెళ్లిపోవడం పట్ల భూనిర్వాసితులు గ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భూ నిర్వాసితులపై లాఠీచార్జ్
RELATED ARTICLES