అడ్డంగా దొరికిపోయిన అవినీతి తిమింగళం
రూ. 70 కోట్ల అక్రమ ఆస్తుల గుర్తింపు
మల్కాజిగిరి ఎసిపి నర్సింహారెడ్డి ఆస్తులపై ఎసిబి దాడులు
ఏకకాలంలో 12 చోట్ల సోదాలు
ప్రజాపక్షం/మేడ్చల్ జిల్లాప్రతినిధి
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మల్కాజ్‌గిరి ఎసిపిగా పని చేస్తున్న నర్సింహారెడ్డి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణపై బుధవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేశారు. అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆయన నివాసంతో పాటు మరికొన్ని చోట్ల సోదా చేశారు. ఉద యం నుంచి ఆయన నివాసంతో పాటు ఏక కాలంలో 12 చోట్ల ఎసిబి అధికారులు సోదా లు నిర్వహించారు. నరసింహారెడ్డి గతంలో ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో సిఐగా పని చేశారు. ఆయన భూ తగాదాలు, సివిల్ కేసుల్లో జోక్యం చేసుకుని పెద్ద ఎత్తున ఆస్తులు కూడగట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎసిబి సోదాలో దాదా పు రూ.75 కోట్ల ఆస్తులు కూడగట్టినట్లు డాక్యుమెంట్లు, ఇతర సమాచారం సేకరించారని తెలుస్తోంది. హైదరాబాద్‌లోని మహీంద్రా హిల్స్, డిడి కాలనీ, అంబర్‌పేట్, ఉప్పల్, వరంగల్‌లో మూడు చోట్ల, కరీంనగర్‌లో రెండు చోట్ల, నల్లగొండలో రెండుచోట్ల, అనంతపురంలోనూ ఎసిబి అధికారులు ఏక కాలం లో సోదా చేపట్టారు. ఎసిపి నరసింహారెడ్డి మాజీ ఐజి చంద్రశేఖర్‌రెడ్డి అల్లుడు. రాత్రి వరకు సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి.
భూదందాలు… పంచాయితీలు!
RELATED ARTICLES