లండన్: ప్రపంచకప్‌లో భువనేశ్వర్‌కు బదులు మహ్మద్ షమీని రెండో పేసర్‌గా తీసుకోవాలని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ సూచించాడు. ప్రస్తుతం షమీ తన కెరీర్లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడని, కోహ్లీసేన అతడి సేవలను ఈ మెగా ఈవెంట్లో ఉపయోగించుకోవాలని పేర్కొన్నాడు. మరోవైపు భువనేశ్వర్ ఇప్పుడు ఫామ్ కోల్పోయాడని త్వరలోనే ఇంతకన్నా మెరుగైన ఫామ్‌తో తిరిగొస్తాడని గంగూలి అన్నాడు. ఓ మీడియాతో మాట్లాడిన గంగూలి ఈ విషయాలను వెల్లడించాడు. ‘ఐపీఎల్ చక్కటి ప్రదర్శన చేసిన షమీ గత ఏడాదిగా టీమిండియాలో అద్భుతంగా రాణిస్తున్నాడు. మరోవైపు భువనేశ్వర్ గత నాలుగైదు నెలలుగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నాడు. యార్కర్ల స్పెషలిస్ట్ అయిన భువీ ఐపిఎల్‌లోనూ సత్తా చాటలేక పోయాడు. ఇతను త్వరలోనే మంచి ఫామ్‌ను అందుకుంటాడు. అలాగే యువ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యని మూడో పేసర్‌గా తీసుకోవాలని, దాంతో మరో బ్యాట్స్‌మెన్‌కు జట్టులో అవకాశం దొరుకుతుంది’ అని గంగూలి అన్నాడు. ప్రస్తుతం భీకర ఫామ్‌లో ఉన్న షమీ సేవలను కోహ్లీ సేన అందిపుంచుకోవాలని దాదా సూచించాడు. ఇక బుమ్రా గురించే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. తన టాలెంట్ ఏంటో ఇప్పటికే చాటుకున్నాడు. వరల్డ్ నంబర్ వన్ బౌలర్‌గా కొనసాగుతున్న బుమ్రా ఈ ప్రపంచకప్ సమరంలో భారత్‌కు మంచి ఫలితాలు అందిచనున్నాడని గంగూలి తెలిపాడు. డెత్ ఓవర్లలో ఇతని పదునైన యార్కర్లు ప్రత్యర్థి బ్యాట్స్‌మెనల్‌కు తిప్పలు పెట్టడం ఖాయమని దాదా పేర్కొన్నాడు. భారత్ ఎలాగైన ప్రపంచకప్ ట్రోఫీ సాధిస్తుందని గంగూలి ఆశభావం వ్యక్తం చేశాడు.
భువీ బదులు షమీని ఆడించండి: గంగూలీ
RELATED ARTICLES