సుప్రీం కోర్టు స్పష్టీకరణ
ఫరూక్ అబ్దుల్లాకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసిన సరోన్నత న్యాయస్థానం
న్యూఢిల్లీ : ప్రభుత్వ అభిప్రాయాలకు భిన్నమైన దృక్పథాల్ని వ్యక్తం చేయడాన్ని దేశ ద్రోహంగా పరిగణించలేమని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. జమ్మూ-కశ్మీర్ ఎంపి, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లాకు వ్యతిరేకం గా దాఖలైన పిటిషన్‌ను కొట్టివేస్తూ సరోన్నత న్యాయస్థానం ఈ విషయం వెల్లడించింది. ప్రభుత్వ అభిప్రాయాలకు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేయడం, అసమ్మతి వ్యక్తం చేయడం వంటి భిన్న దృక్పథాలన్నిటినీ దేశద్రోహం గాటన కట్టలేమని పేర్కొంది. జమ్మూ కశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తిని కలుగజేస్తున్న రాజ్యాంగంలో ఉన్న 370వ అధికరణను 2019 ఆగస్టు నెలలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు తీర్మానం ద్వారా రద్దు చేసింది. దీంతో జమ్మూకశ్మీర్, లడఖ్‌లు రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఆవిర్భవించాయి. ప్రభుత్వ చర్యను వ్యతిరేకిస్తూ ఫరూక్ అబ్దుల్లా చైనా, పాకిస్థాన్ దేశాల సహాయం కోరాడని చేసిన ఆరోపణను నిరూపించడంలో పిటిషర్ విఫలమయ్యారని పేర్కొంటూ సుప్రీంకోర్టు ఆయనకు యాభైవేల రూపాయలు జరిమానా విధించింది. 370వ అధికరణను రద్దుకు వ్యతిరేకంగా ఫరూక్ అబ్దుల్లా కేంద్ర్ర పభుత్వాన్ని నిరసిస్తూ చేసిన వ్యాఖ్యలపై రజత్ శర్మ, నేహ్ శ్రీవాత్సవలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఫరూక్ అబ్దుల్లా ‘జాతి వ్యతిరేకి’ అని ఆ పిటిషన్‌లో వారు పేర్కొన్నారు. ఆయనను పార్లమెంటు సభ్యుడుగా కొనసాగించినట్లుతై అది దేశ ఐక్యతకు వ్యతిరేకంగా ఎవరినైనా జాతి వ్యతిరేక కార్యకలాపాల నిర్వహణకు ఆమోదం తెలిపినట్టే కాగలదని పిటిషనర్లు పేర్కొన్నారు. 83 ఏళ్ళు వయసుగల ఫరూక్ అబ్దుల్లా శ్రీనగర్ నియోజకవర్గం నుండి నేషనల్ కాన్షరెన్స్‌పార్టీ ఎంపిగా లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 370వ అధికరణాన్ని రద్దు చేసిన తర్వాత ఫరూక్ అబ్దుల్లా (83) తోపాటు ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లాను కూడా ప్రభుత్వం నిర్బంధంలో ఉంచింది.
భిన్నాభిప్రాయం… దేశద్రోహం కాదు
RELATED ARTICLES