ఆంధ్రప్రదేశ్‌లో కలిసి పోటీ చేయనున్న జనసేన, సిపిఐ, సిపిఐ(ఎం)
విశాఖపట్నం / హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో జనసేన, సిపిఐ, సిపిఐ(ఎం) కలిసి పని చేయాలన్న నిర్ణయించాయి. ప్రజా ఉద్యమాలను రాజకీయ స్థాయికి తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశాయి. విశాఖపట్నంలోని సాయిప్రియ రిసార్ట్‌లో శుక్రవారం జనసేన, సిపిఐ,సిపిఐ(ఎం) అగ్రనేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్‌తో పాటు సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు పాల్గొన్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పార్టీలకు ఒకే రకమైన భావజాలం ఉండటంతో మూడు పార్టీ లు పర్యావరణ కాలుష్యం, మైనింగ్ పాలసీ, 2013 భూసేకరణ చట్టం అమలు, జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ నివేదికను ఎలా ముందుకు తీసుకెళ్లాలి, 2019 ఎన్నికల్లో కలిసి ఎలా ముందు కు వెళ్లాలి, ఇవిఎంలపై నెలకొన్న అనుమానాలపై చర్చించామని తెలిపారు. ఫిబ్రవరిలో మరోసారి సమావేశమై పొత్తులు, సీట్ల సర్దుబాటుపై చర్చిస్తామని చెప్పారు.
భావజాలానికి బాసట!
RELATED ARTICLES