HomeNewsLatest Newsభారత జట్టును ప్రకటించిన బిసిసిఐ

భారత జట్టును ప్రకటించిన బిసిసిఐ

మహిళల టీ20 వరల్డ్‌ కప్న్‌కు భారత జట్టును బిసిసిఐ ప్రకటించింది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలో 15 మందితో కూడిన జట్టును మంగళవారం వెల్లడించింది. వికెట్‌ కీపర్‌ యస్తికా భా టియా, యువ స్పిన్నర్‌ శ్రేయాంక్‌ పాటిల్‌ను కూ డా ఎంపిక చేసింది. అయితే వాళ్ల ఫిట్‌నెస్‌ నిరూపణపై జట్టులో కొనసాగుతారని బిసిసిఐ స్పష్టం చే సింది. స్టార్‌ బ్యాటర్‌ స్మృతి మంధాన వైస్‌కెప్టెన్‌గా కొనసాగనుంది. రి జర్వ్‌ ప్లేయర్లుగా ఉ మ ఛెత్రి, తనుజ, సై మా ఎంపికయ్యారు. దుబాయ్‌ వేదికగా అక్టోబర్‌ 3 నుంచి 20 వరకు మహిళల టీ20 వరల్డ్‌ కప్‌ జరగనుంది. అంతకుముందు నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం ఈ మెగాటోర్నీ బంగ్లాదేశ్‌ వేదికగా జరగాల్సి ఉంది. కానీ అక్కడ నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో పొట్టి కప్‌ను యుఎఇ వేదికగా నిర్వహిస్తున్నారు. కాగా, ఈ ప్రపంచకప్‌లో మొత్తం పది జట్లు పాల్గొంటున్నాయి. అయిదు జట్లు రెండు గ్రూప్‌లు విడిపో యి సెమీఫైనల్స్‌ బెర్తు కోసం పడనున్నాయి. భా రత్‌ గ్రూప్‌-ఏలో ఉంది. ఈ గ్రూప్‌లో ఇండియాతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ పాకిస్థాన్‌, శ్రీలంక ఉన్నాయి. మరోవైపు గ్రూప్‌-బీలో సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌ వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌, స్కాట్లాండ్‌ ఉ న్నాయి. అక్టోబర్‌ 4 నుంచి భారత్‌ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. న్యూజిలాండ్‌తో తొలి మ్యాచ్‌ ఉంది. ఇక అక్టోబర్‌ 6న చిరకాల ప్రత్యర్థి పా కిస్థాన్‌తో టీమిండియా అమీతుమి తే ల్చుకోనుంది. అలాగే అక్టోబర్‌ 9న శ్రీ లంక, అక్టోబర్‌ 13న ఆస్ట్రేలియాతో తలపడనుంది. అక్టోబర్‌ 17, 18న సెమీఫైనల్స్‌, అక్టోబర్‌ 20న ఫైనల్‌ జరగనుంది.

మహిళల టీ20 వరల్డ్‌ కప్‌కు ఎంపికైన భారత జట్టు

హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌), స్మృతి మంధాన (వైస్‌ కెప్టెన్‌), షెఫాలి వర్మ, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్‌, రిచా ఘోష్‌ (వికెట్‌ కీపర్‌), యస్తికా భాటియా (వికెట్‌ కీపర్‌), పూజ వస్త్రాకర్‌, అరుంధతి రెడ్డి, రేణుక సింగ్‌ ఠాకూర్‌, హేమలత, ఆశ శోభన, రాధా యాదవ్‌, శ్రేయాంక్‌ పాటిల్‌, సజన.
రిజర్వ్‌ ప్లేయర్లు: ఉమ ఛెత్రి (వికెట్‌ కీపర్‌), తనుజ, సైమా
నాన్‌ ట్రావెలింగ్‌ రిజర్వ్‌ ప్లేయర్లు: రఘ్వీ బిస్త్‌, ప్రియ మిశ్రా.

 

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments