చెలరేగిన బౌలర్లు, రోహిత్ అజేయ అర్ధ శతకం, చివరి వన్డేలో విండీస్ చిత్తు
తిరవనంతపురం: వెస్టిండీస్ జరిగిన ఐదు మ్యాచ్ వన్డే సిరీస్ టీమిండియా 3-1తో కైవసం చేసుకుంది. భారత ఆటగాళ్లు సమిష్టిగా రాణించడంతో చివరి వన్డేలో భారత్ 9 వికెట్లతో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. భారత బౌలర్లు చెలరేగడంతో మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టు 31.5 ఓవర్లలో 104 పరుగులకే కుప్పకూలింది. రవీంద్ర జడేజా 4 వికెట్లు పడగొట్టాడు. తర్వాత లక్షఛేదనకు దిగిన టీమిండియా కేవలం ఒక వికెట్ నష్టపోయి 14.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. రోహిత్ శర్మ (63; 56 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్ కెప్టెన్ కోహ్లి (౩౩ నాటౌట్) ఇతనికి అండగా నిలిచాడు. ఈ మ్యాచ్ టీమిండియా 211 బంతులు మిగిలుండగానే విజయాన్ని అందుకోవడం మరో విశేషం. మ్యాచ్ విజృంభంచి మరోవైపు బౌలింగ్ చేసిన జడేజాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవర్డు లభించింది. మరోవైపు సిరీస్ అమాంతం రాణించి భారత విజయాల్లో కీలక పాత్ర పోషించిన భారత సారథి విరాట్ కోహ్లికి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది.
గురువారం ఇక్కడ జరిగిన చివరి, ఐదో వన్డే మ్యాచ్ స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ దిగిన టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. రెండో ఓవర్ ఓపెనర్ శిఖర్ ధావన్ (6) పరుగులు మాత్రమే చేసి థోమస్ బౌలింగ్ క్లీన్ బౌల్డ్ వెనుదిరిగాడు. దీంతో టీమిండియా ౬ పరుగుల వద్దే తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లితో కలిసి మరో ఓపెనర్ రోహిత్ శర్మ భారత ఇన్నింగ్స్ ముందుకు నడిపించాడు. వీరిద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ స్కోరుబోర్డును ముందుకు సాగించారు. అవకాశం చిక్కినప్పుడల్లా చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ పరుగులను రాబట్టుకున్నారు. ఒకవైపు కోహ్లి సమన్వయంతో ఆడుతుంటే మరోవైపు రోహిత్ మాత్రం దూకుడుగా ఆడుతూ వేగంగా పరుగులను రాబట్టుకున్నాడు. దీంతో టీమిండియా 9.3 ఓవర్లలో తొలి 50 పరుగులను పూర్తి చేసుకుంది. తర్వాత రోహిత్ శర్మ మరింతగా విజృంభించడంతో పరుగుల వేగం ఊపందుకుంది. విండీస్ బౌలర్లపై విరుచుకుపడిన రోహిత్ మూడు సిక్సర్లు బాదీ 45 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే టీమిండియా 14.2 ఓవర్లలో 100 పరుగుల మైలురాయిని పూర్తి చేసుకుంది. తర్వాత అదే ఓవర్ చివరి బంతికి 105/1 పరుగులు చేసి ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ శర్మ 56 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయంగా 63 పరుగులు చేశాడు. మరోవైపు ఇతనికి అండగా నిలిచిన కోహ్లి 29 బంతుల్లో 6 ఫోర్లతో 33 పరుగులు చేసి నాటౌట్ ఉన్నాడు. అంతకుముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ ఆరంభం కలిసి రాలేదు. మ్యాచ్ తొలి ఓవర్ ఓపెనర్ పొవెల్ (0)ను భువనేశ్వర్ పల్టీ కొట్టించాడు. దీంతో విండీస్ ఒక పరుగుకే తొలి వికెట్ కోల్పోయింది. ఆతర్వాత వచ్చిన వికెట్ కీపర్ హోప్ (0) కూడా ఖాతా తెరువకుండానే బుమ్రా బౌలింగ్ వెనుదిరిగాడు. అనంతరం రోమన్ పొవెల్, శ్యాముల్స్ విండీస్ ఇన్నింగ్స్ ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ జడేజా తన స్పిన్ మ్యాజిక్ దూకుడుగా ఆడుతున్న శ్యాముల్స్ (24; ౩8 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్)ను ఔట్ చేశాడు. తర్వాత భారత బౌలర్లు మరింతగా చెలరేగి బౌలింగ్ చేశారు. నిప్పులు చెరిగే బంతులతో కరేబియన్ బ్యాట్స్ హడలెత్తించారు. వీరి ధాటికి విండీస్ వరుసక్రమంలో వికెట్లు కోల్పోతూ పోయి తక్కువ స్కోరుకే పరిమితమైంది. కెప్టెన్ జాసన్ హోల్డర్ 33 బంతుల్లో 2 ఫోర్లతో 25 పరుగులు చేసి టాప్ స్కోరర్ నిలిచాడు. మరోవైపు రోమన్ పావెల్ (16) పరుగులు చేసి వెనుదిరిగాడు. విండీస్ ఈ ముగ్గిరి తప్ప మిగతా బ్యాట్స్ ఎవ్వరూ కూడా రెండంకెళ్ల స్కోరు మార్కును దాటలేక పోయారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా అద్భుతమైన బౌలింగ్ ఆకట్టుకున్నాడు. జడేజా 9.5 ఓవర్లలో 34 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన 4 వికెట్లు పడగొట్టాడు. ఇతర బౌలర్లలో బుమ్రా, యువ బౌలర్ ఖలీల్ అహ్మద్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. మరోవైపు భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్ చెరొక్క వికెట్ దక్కించుకున్నారు.