ప్రధాన మంత్రి నరేంద్రమోడీ
టోక్యో : భారత్ దేశాలు రెండూ సహజసిద్ధమైన భాగస్వామ్యదేశాలని భారతదేశం లో, దేశ అభివృద్ధి ప్రయాణంలో జపాన్ దేశ పెట్టుబడులు అతి కీలకమైన పాత్ర నిర్వహిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. రెండు రోజుల పర్యటనకు టోక్యో చేరిన మోడీ సోమవారం నాడు భారత డయాస్పోరాను ఉద్దేశించి ప్రసంగిస్తూ, భారతదేశంలో మౌలిక ప్రాతిపదిక సౌకర్యాల అభివృద్ధి వేగం, వాటి సామర్థ్యం అసాధారణంగా ఉన్న విషయాన్ని ప్రపంచదేశాలు ప్రత్యక్షంగా చూస్తున్నాయని అన్నారు. జపాన్ తో భారతదేశ అనుబంధాన్ని ఆయన అతిశక్తిమంతమైనదిగా పేర్కొంటూ, ప్రపంచంలో సమస్యల పరిష్కారానికి ఇరు దేశాలు ఒకే విధంగా ఉమ్మడి ఆలోచనలు చేస్తాయన్నారు. ముంబయి హై స్పీడ్ రైల్, ఢిల్లీ ఇండ్రస్ట్రియల్ కారిడార్‌ల అభివృద్ధి జపాన్ శక్తిసామర్థ్యాలతోనే సాధ్యమయ్యాయని అన్నారు. భారతదేశంలో మౌలిక సదుపాయాల విస్తరణలో జపాన్ దేశం అత్యంత కీలకమైన పాత్ర నిర్వహిస్తోందని అన్నారు. ప్రపంచదేశాలకు ఈరోజున గౌతమబుద్ధుడు చూపిన మార్గమే అనుసరణీయమని ఆయన అన్నారు. ప్రస్తుతం సవాళ్ళు ఎదుర్కొంటున్న ప్రపంచంలో మానవ వ్యవస్థను, మానవాళిని కాపాడటానికి గౌతమబుద్ధిని బోధనలు ఒక్కటే శరణ్యమని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం, అచాచకం, వాతావరణ విధ్వంసం, హింసాత్మక ఘటనలు పేట్రేగిపోయాయని, వీటికి పరిష్కారంగా గౌతమ బుద్ధుని బోధనలే దోహదం చేస్తాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థ దెబ్బతిందని అందువల్ల భారతదేశం ‘ఆత్మనిర్భర్’ మార్గాన్ని చేపట్టిందని అన్నారు. జపాన్ పర్యటన సందర్భంగా మోడీ సోమవారంనాడు జపాన్ వ్యాపారవేత్తలను కలుసుకున్నారు. వారితో చర్చలు జరిపారు. భారత్‌లో ఎన్నో పారిశ్రామిక అవకాశాలు ఉన్నాయని, పెట్టుబడులకు ఎన్నో గొప్ప అవకాశాలు, అందుకు తగిన వాతావరణం సిద్ధంగా ఉందని ఆయన వారికి భరోసా ఇచ్చారు. ఎలక్ట్రాకిన్ జైంట్ ఎన్‌ఇసి కార్పోరేషన్ ఛైర్మన్ నోబుహిరో ఎండోతో ఆయన మావేశమయ్యారు. సుజుకి సంస్థ అధిపతితో సమావేశం జరిపారు.
భారత్ సహజ భాగస్వాములు
RELATED ARTICLES