పాక్ ప్రధాని ఇమ్రాన్
ఇస్లామాబాద్: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో ఇరు దేశాలకు సంబంధించిన పలు ద్వైపాక్షి అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. గురువారం ఇస్లామాబాద్ తనతో మాట్లాడిన పలువురు భారతీయ జర్నలిస్టులతో భారత్,పాకిస్థాన్ సంబంధాలపై తన అభిప్రాయాలను వారితో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తమ భూభాగం నుంచి సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించబోమని, అలాంటీ విషయాల్లో కఠినమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇతర దేశాల్లో ఉగ్రవాద కార్యకాలపాలకు పాల్పడే వారికి తమ ప్రాంతం అడ్డంగా ఉండడంపై తమకు ఆసక్తి లేదన్నారు. పాకిస్థాన్, భారత్ స్నేహాం కోరుకుంటుందని, ఇరు దేశాల ద్వైపాక్షిక అంశాలపై భారత ప్రధాని మోడీతో చర్చించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. కాశ్మీర్ సమస్యకు పరిష్కారం కనుక్కోగలరా..? అని విలేకర్ల అడిగిన ప్రశ్నకు సంబంధించిన ఇమ్రాన్.. పాక్ ప్రజల ఆలోచన విధానం మారిందని, అసాధ్యమనేది ఏది ఉండదని బదులిచ్చారు. కాశ్మీర్ సమస్య సైన్యం ద్వారా ఎప్పటికీ పరిష్కారం కాదని, శాంతి ఒక్కవైపు నుంచి వస్తే సరిపోదని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత భారత్ ఇరు దేశాల ద్వైపాక్షి చర్చలపై సానుకూలంగా స్పందిస్తుందని తాము భావిస్తున్నట్లు తెలిపారు.
భారత్, పాక్ ద్వైపాక్షిక సంబంధాలపై ప్రధాని మోడీతో చర్చించేందుకు సిద్ధం
RELATED ARTICLES