HomeSportsCricketభారత్‌ ఘన విజయం ఇంగ్లాండ్‌పై 2 ఆధిక్యం

భారత్‌ ఘన విజయం ఇంగ్లాండ్‌పై 2 ఆధిక్యం

రాజ్‌కోట్‌: ఇంగ్లాండ్‌తో ఆదివారం ముగిసిన మూడో టెస్టు మ్యాచ్‌లో భారత్‌ 434 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ఐదు మ్యాచ్‌ల ఈ టెస్టు సిరీస్‌లో 2 ఆధిక్యం సంపాదించింది. హైదరాబాద్‌లో జరిగిన మొదటి టెస్టును ఇంగ్లాండ్‌ 28 పరుగుల తేడాతో గెల్చు కోగా, వైజాగ్‌ రెండో టెస్టులో భారత్‌ 106 పరుగుల ఆధి క్యంతో గెలుపొందింది. దీనితో చెరొక విజయంతో సమవు జ్జీగా ఉన్న భారత్‌, ఇంగ్లాండ్‌ జట్లు రాజ్‌కోట్‌ వేదికగా జరి గిన మూడో టెస్టులో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 130.5 ఓవర్లలో 445 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 131, ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా 112 పరుగులతో రాణించగా, సర్ఫ్‌రాజ్‌ ఖాన్‌ 62 పరుగు లు చేశాడు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో మార్క్‌ ఉడ్‌ 114 పరుగు లిచ్చి 4 వికెట్లు కూల్చాడు. అనంతరం మొదటి ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ 71.1 ఓవర్లలో 319 పరుగులకు ఆలౌటైంది. డకెట్‌ (153)ని మినహా యిస్తే ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు ఎవరూ భారత్‌ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోలేకపోయారు. కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ 41 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో సిరాజ్‌ 84 పరుగుల కు నాలుగు వికెట్లు కూల్చగా, కుల్దీప్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా చెరి రెండు వికెట్లు పడగొట్టారు. జస్‌ప్రీత్‌ బుమ్రా, రవిచంద్రన్‌ అశ్విన్‌కు చెరొక వికెట్‌ దక్కింది. కాగా, 126 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని సంపాదించిన భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ను 98 ఓవర్లలో నాలుగు వికెట్లకు 430 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసి, ఇంగ్లాండ్‌ ముందు 557 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని ఉంచింది. భారత ఓపెనర్‌ అశస్వి జైస్వాల్‌ అజేయంగా 214 పరుగులు సా ధించి, భారత్‌ భారీ స్కోరుకు సహకరించాడు. శుభ్‌మన్‌ గిల్‌ 91 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద అవుట్‌కాగా, సర్ఫ్‌ రాజ్‌ ఖాన్‌ 68 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. అనం తరం, అసాధ్యంగా కనిపిస్తున్న ఈ లక్ష్యాన్ని ఛేదించడం లో విఫలమైన ఇంగ్లాండ్‌ తన రెడో ఇన్నింగ్స్‌లో 39.4 ఓవ ర్లు మాత్రమే ఆడి, 122 పరుగుల వద్ద కుప్పకూలింది. 33 పరుగులు చేసిన మార్క్‌ ఉడ్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడంటే, ఇంగ్లాండ్‌ పతనాన్ని ఊహించుకోవచ్చు. రవీంద్ర జడేజా 41 పరుగులకు 5 వికెట్లు పడట్టి ఇంగ్లాండ్‌ను ప రాజయాన్ని శాసించాడు. ఆటు బ్యాటింగ్‌లో, ఇటు బౌ లింగ్‌లో రాణించిన అతను ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవా ర్డును అందుకున్నాడు. కుల్దీప్‌ యాదవ్‌ 19 పరుగులకు రెండు వికెట్లు పడగొట్టగా, బుమ్రా, అశ్విన్‌ చెరొక వికెట్‌ పంచుకున్నారు. ఈ సిరీస్‌లో భాగంగా నాలుగో టెస్టు ఈ నెల 23న రాంచీలో మొదలవుతుంది. చివరిదైన ఐదో టెస్టు మార్చి 7 నుంచి ధర్మశాలలో ప్రారంభమవుతుంది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments