ప్రధాని, ఖతార్ అమీర్ మధ్య విస్తృత స్థాయి చర్చలు
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ, ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థని మధ్య మంగళవారం విస్తృత స్థాయిలో చర్చలు సాగాయి. వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి చేరేలా ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడాలని ఆశించారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, శక్తి, ప్రజల మధ్య సత్సంబంధాల నేపథ్యంగా ఇరు దేశాల మధ్య లోతైన, సాంప్రదాయ సంబంధాలు నెలకొనాలని ఇరు దేశాల నేతలు చర్చలు జరిపారు. అంతేగాక ప్రాదేశిక, ప్రపంచ సమస్యలపైకూడా వారు అభిప్రాయాలను పంచుకున్నారని భారత విదేశీ వ్యవహరాల శాఖ వెల్లడించింది. మోదీ ఆహ్వానంపై ఖతార్ అమిర్ రెండు రోజుల పర్యటనకు భారత్ వచ్చారు. ఆయన భారత్ కలుసుకోవటం ఇది రెండోసారి. గతంలో 2015 మార్చిలో భారత్ పర్యటనకు వచ్చారు. ఖతార్
అమీర్ పర్యటనతో ఇరు దేశాల బహుముఖ భాగస్వామ్యం మరింత ఉన్నతికి చేరుకుంటుందని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. అంతకుముందు ఖతార్ అమీర్ రాష్ట్రపతి భవన్ సైనికుల గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అమీర్ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మోదీకూడా పాల్గొన్నారు. తరువాత హైదరాబాద్ హౌస్ మోదీ, అమీర్ తమీమ్ ద్వైపాక్షిక సమస్యలపై చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం నెలకొల్పే అంశంపై ఒప్పందం కుదిరింది. ఇందుకు సంబంధించిన ఒప్పంద పత్రాలను ప్రధాని మోదీ, ఖతార్ అమీర్ సమక్షంలో ఖతార్ విదేశీ వ్యవహారాల మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్హ్రమాన్ బిన్ జస్సిమ్ అల్ థని, భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ ఇచ్చిపుచ్చుకున్నారు. ‘భారత్ మధ్య సాంప్రదాయ సంబంధాలు మరింత బలపడ్డాయి. ప్రధాని మోదీ, ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థని ఈరోజు హైదరాబాద్ హౌస్ చర్చలు జరిపారు. భారత్ మధ్య సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి చేర్చాలని ఇరు దేశాల నేతలు నిశ్చయించారు. పలు విభాగాలలో సంబంధాలు పటిష్టమయేలా చర్చలు సాగాయి. వారు ప్రాదేశిక, ప్రపంచ సమస్యలపైకూడా చర్చించారు’ అని విదేశీ వ్యవహారాలు శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
భారత్, ఖతార్ మధ్య బలీయమైన చారిత్రక సంబంధాలు, పరస్పర గౌరవం, విశ్వాసం కొనసాగుతున్నాయి. ఇటీవలి కాలంలో ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, సాంకేతికత, సంస్కృతి, ప్రజల మధ్య సంబంధాలు బలపడుతున్నట్టు అంతకుముందు విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. ఇరు దేశాల నేతల మధ్య చర్చలు భారత్ భాగస్వామ్యంలో సరికొత్త మైలురాయిగా విదేశీ వ్యవహారాల శాఖ ఎక్స్ వేదికగా పేర్కొన్నది. ఆదాయంపై ద్వంద్వ పన్ను విధానం, ఆర్ధిక ఎగవేత అంశాలపైకూడా ఇరు దేశాల మధ్య సవరించబడిన ఒప్పందానికి ఆమోదించినట్టు అధికారులు తెలిపారు. ఖతార్ ప్రధాని, కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ ఈ ఒప్పందాన్ని పరస్పరం మార్పిడి చేసుకున్నారు. ఖతార్ అమీర్ సోమవారం సాయంత్రం భారత్ చేరుకోగా, ప్రధాని స్వయంగా స్వాగతించారు. గత యేడాది ఫిబ్రవరిలో మోదీ ఖతార్ పర్యటన సందర్భంగా అమీర్ ఆహ్వానం పలికారు. ప్రధాని మోదీ అరుదైన ఆతిథ్యం పలికే రీతిలో స్వయంగా ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్లి అమీర్ స్వాగతం పలికారు. ఖతార్ అమీర్ కరచాలనం చేసి, హత్తుకుని తమ మధ్య స్నేహాన్ని చాటారు. అనంతరం మోదీ ఎక్స్ వేదికగా ‘విమానాశ్రయానికి వెళ్లి సోదరతుల్యుడు, ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థనికి స్వాగతం పలికాను. తన భారత పర్యటన ఫలవంతం కావాలని, మా మధ్య చర్చలకోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’ అని పేర్కొన్నారు. ఖతార్ అమీర్ వెంట ఆ దేశానికి చెందిన ఉన్నత స్థాయి అధికార బృందం, పలువురు మంత్రులు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు. అనంతరం కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ కూడా అమీర్ కలుసుకున్నారు. గత యేడాది ప్రధాన మోదీ ఖతార్ పర్యటన సందర్భంగా సాంకేతికత, పెట్టుబడులు, శక్తి, వాణిజ్యం, తదితర అంశాలపై చర్చలు జరిగినట్టు అప్పటి విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ ఖ్వత్రా తెలిపారు. ప్రస్తుత అమీర్ పర్యటన ఇరు దేశాల సంబంధాలను మరింత బలపరుస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఖతార్ నివసిస్తున్న విదేశీయులలో భారత సంతతి అత్యధికమని, ఖతార్ అభివృద్ధిలో భారతీయుల కృషి ఎనలేనిదని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది.