నేడు ప్రపంచకప్ తొలి టి20 మ్యాచ్
ఫెవరేట్‌గా టీమిండియా.. డిపెండింగ్ ఛాంపియన్‌గా అస్ట్రేలియా
మెల్బోర్న్ : అమ్మాయిల ధనాధన్ క్రికెట్ వరల్డ్‌కప్‌కు రంగం సిద్ధమైంది. 2009లో మొదలైన ఈ టోర్నమెంట్ ప్రతీ సీజన్‌కు క్రేజ్‌ను పెంచుకుంటూ ఏడో ఎడిషన్‌లోకి అడుగుపెట్టింది. ఈ సీజన్లో పది దేశాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఇప్పటికే నాలుగు పొట్టి క్రికెట్ గెలుచుకున్న కంగారూలు సొంతగడ్డపై పాంచ్ పటాకా సాధించాలని ఉవ్విళ్లూరుతున్నారు. మరోవైపు భారీ అంచనాలతో బరిలోకి దిగుతున్న ఇండియా తొలిసారి కప్పు కైవసం చేసుకొవాలని పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మహాశివరాత్రి రోజు అనగా రేపటి నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీ వచ్చే నెల 8న పూర్తి కానుంది. కాగా, మొదటి మ్యాచ్ ఇండియా వెర్సస్ ఆస్ట్రేలియా సిడ్నీ వేదికగా రేపు మధ్యాహ్నం 1.30 గంటలకు జరగనుంది.
భారత్ x ఆసీస్
RELATED ARTICLES