రికార్డు స్థాయిలో 19 పతకాలు
ముగిసిన టోక్యో పారాలింపిక్స్
టోక్యో: భారత్ గతంలో ఎన్నడూ లేని విధంగా టోక్యో ఒలింపిక్స్ లో ఏకంగా 19 పతకాలను కైవ సం చేసుకుంది. అత్యధిక పతకాలను సాధించిన జట్ల జాబితాలో 24వ స్థానానికి పరిమితమైనప్పటికీ, ఇప్పటి వరకూ అసాధ్యమనుకున్న పతకాల కల ను సాకారం చేసుకుంది. టోక్యో పారాలింపిక్స్‌కు ముందు భారత్ దివ్యాంగులకు నిర్వహించే ఈ మెగా ఈవెంట్‌లో కేవలం 12 పతకాలను సంపాదించింది. దీనిని ప్రమాణికంగా తీసుకుంటే, టోక్యోలో భారత పారా అథ్లెట్ల ప్రదర్శన ఎంత ఉన్నతంగా ఉందో ఊహించుకోవచ్చు. ఈ పోటీలకు చివరి రోజైన ఆదివారం కూడా భారత్ తన పతకాల వేటను కొనసాగించింది. పురుషుల బాడ్మింటన్ సింగిల్స్ ఎస్‌హెచ్6 విభాగంలో కృష్ణ నాగర్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. టైటిల్ పోరులో అతను హాంకాంగ్ షట్లర్ చూ మాన్ కాయ్‌ని ఓడించి, స్వర్ణ పతకాన్ని అందుకున్నాడు. బాడ్మింటన్ ఎస్‌ఎల్4 విభాగంలో ఐఎఎస్ అధికారి సుహాస్ లలినాకెయి యతిరాజ్ రజత పతకాన్ని అందుకున్నాడు. నోయిడా జిల్ల మెజిస్ట్రేట్‌గా పని చేస్తున్న అతను ఫైనల్‌లో ఫ్రాన్స్‌కు చెందిన లుకాస్ మజుర్ చేతిలో పరాజయాన్ని ఎదుర్కొని, రజత పతకంతో సంతృప్తి చెందాడు. చివరి రోజు సాధించిన రెండు పతకాలతో కలిసి భారత్ టోక్యో పారాలింపిక్స్‌ను 19 పతకాలతో ముగించింది. ఇందులో 5 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్య పతకాలు ఉన్నాయి. కాగా, చైనా అత్యధికంగా 207 పతకాలు (96 స్వర్ణం, 60 రజతం, 51 కాంస్యం) సంపాదించి అగ్రస్థానాన్ని ఆక్రమించింది. గ్రేట్ బ్రిటన్ 41 స్వర్ణాలు, 38 రజతాలు, 45 కాంస్యాలతో మొత్తం 124 పతాలను కైవసం చేసుకొని ద్వితీయ స్థానంలో నిలిచింది. 37 స్వరిఆ్ణలు 36 రజతాలు, 31 కాంస్యాలుసహా మొత్తం 104 పతకాలతో అమెరికా మూడో స్థానంతో సంతృప్తి చెందింది. డోపింగ్ సమస్యల కారణంగా నిషేధాన్ని ఎదుర్కొంటున్న రష్యా అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ (ఆర్‌పిసి) జెండాతో బరిలోకి దిగింది. 36 స్వర్ణాలు, 33 రజతాలు, 49 కాంస్యాలతో 118 పతకాలను తన ఖాతాలో వేసుకొని నాలుగో స్థానంలో నిలిచింది. నెదర్లాండ్స్, ఉగ్రెయిన్, బ్రెజిల్, ఆస్ట్రేలియా, ఇటలీ, అజర్‌బైజన్ వరుసగా ఐదు నుంచి పది స్థానాలను సంపాదించుకున్నాయి.
భారత్ తరఫున పతకాలు సాధించిన పారా అథ్లెట్లు వీరే..
స్వర్ణంః 1. అవని లెఖారా (మహిళల షూటింగ్ ఆర్2 పది మీటర్ల ఎయిర్ స్టాండింగ్ ఎస్‌హెచ్ 1), 2. సుమీత్ అంటిల్ (పురుషుల జావెలిన్ త్రో ఎఫ్ 64), 3. మనీష్ నర్వాల్ (పురుషుల షూటింగ్ డి4 మిక్స్‌డ్ 50 మీటర్ల పిస్టల్ ఎస్‌హెచ్ 1), 4. ప్రమోద్ భగత్ (పురుషుల బాడ్మింటన్ సింగిల్స్ ఎస్‌ఎల్3), 5.కృష్ణ నాగర్ (పురుషుల బాడ్మింటన్ సింగిల్స్ ఎస్‌హెచ్6). రజతం ః 1. భవీనాబెన్ పటేల్ (టేబుల్ టెన్నిస్ మహిళల ఇండివిజువల్ క్లాస్ 4), 2. నిషాద్ కుమార్ (పురుషుల హైజంప్ టి47), 3. యోగేష్ ఖతూనియా (పురుషుల డిస్కస్‌త్రో ఎఫ్ 56), 4. దేవేంద్ర జఝారియా (పురుషుల జావెలిన్‌త్రో ఎఫ్46), 5. మరియప్ప తంగవేలు (పురుషుల హైజంప్ టి63), 6. ప్రవీణ్ కుమార్ (పురుషుల హైజంప్ టి 64), 7. సింగ్‌రాజ్ అధానా (షూటింగ్ పురుషుల 50 మీటర్ల పిస్టల్ మిక్స్‌డ్ పి4 , ఎస్‌హెచ్1), 8. సుహాస్ లలినాకెయి యతిరాజ్ (బాడ్మింటన్ పురుషుల ఎస్‌ఎల్4). కాంస్యంః 1. సుందర్ సింగ్ గుర్జార్ (పురుషుల జావెలిన్ ఎఫ్ 46), 2. సింగ్‌రాజ్ అధానా (పురుషుల షూటింగ్ పి1, పది మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్ 1), 3. శరద్ కుమార్ (పురుషుల హైజంప్ టి63), 4. అవని లెఖారా (మహిళల ఆర్8 షూటింగ్ 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్, ఎస్‌హచ్1), 5. హర్వీందర్ సింగ్ (పురుషుల ఆర్చరీ ఇండివిజువల్ కర్వ్ ఓపెన, 6. మనోజ్ సర్కార్ (బాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎల్‌ఎల్3).
భారత్ సూపర్
RELATED ARTICLES