న్యూఢిల్లీ: భారత్- మధ్య పదోవిడత సైనికస్థాయి చర్చలు పూర్తయ్యాయి. ఈ చర్చలు 16 గంటలపాటు విస్తారంగా కొనసాగాయి. తూర్పు లఢఖ్‌లో ఉభయదేశాల సైన్యాలను వెనక్కు మళ్ళించే ప్రక్రియ తదుపరి కొనసాగింపుపై ఈ చర్చలు జరిగాయని ఆదివారంనాడు అధికార వర్గాలు తెలియజేశాయి. వాస్తవాధీనరేఖ వద్ద చైనా వైపు మోల్డో వద్ద శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన చర్చలు ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ముగిశాయి. గోగ్రా, దెస్పాంగ్ ప్రాంతాల్లో రెండు దేశాలు ప్రధానంగా దృష్టి కేంద్రీకరించిన ప్రాంతాల నుండి బలగాలను పూర్వస్థితులకు మళ్ళించే విషయంపై ఈ చర్చలు జరిగాయి. అయితే ఈ చర్చల ఫలితాలపై మాత్రం ఇంతవరకూ ఎలాంటి ప్రకటనా ఇరువైపుల నుండీ వెలువడలేదు. అయితే మిగిన ఉపసంహరణ ప్రక్రియ కూడా శరవేగంగా పూర్తికావాలని భారత్ ఈ చర్చల్లో పట్టుపట్టినట్టు తెలుస్తోంది.
భారత్-చైనా పదోవిడత చర్చలు ముగిశాయ్
RELATED ARTICLES