కౌలాలంపూర్ : భారత్, మలేసియా మహిళా ఫుట్‌బాల్ జట్ల మధ్య ప్రారంభమైన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది. తొలి మ్యాచ్‌లో భారత అమ్మాయిలు 3 గోల్స్‌తో ఆతిథ్య మలేసియాను చిత్తు చేశారు. గురువారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో మొదటి నుంచే చెలరేగి ఆడిన భారత జట్టు ప్రత్యర్థిపై పూర్తి ఆధిక్యంను ప్రదర్శించింది. వరుస దాడులతో వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ముందు సాగింది. భారత స్ట్రయికర్ వందన కతరియా రెండు గోల్స్ సాధించి విజయంలో కీలక పాత్ర పోషించింది. (17వ) నిమిషంలోనే వందన కాతరియా కళ్లు చెదిరే గోల్‌తో భారత్ ఖాతా తెరిచింది. తర్వాత (38వ) నిమిషంలో లాల్రెసియామి మరో గోల్ చేయడంతో భారత్ 2 ఆధిక్యంలో దూసుకెళ్లింది. మరోవైపు మలేసియా అమ్మాయిలు గోల్ చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ భారత కీపర్ వారి దాడులను సమర్థంగా ఎదుర్కొంటూ గొప్ప ప్రదర్శన చేసింది. ఆఖర్లో (60వ) నిమిషంలో వందన ఇంకొక్క గోల్ చేసి భారత్ ఆధిక్యాన్ని 3 పెంచింది. అనంతరం మ్యాచ్ ముగిసే సమయానికి మరో గోల్ నమోదుకాకపోవడంతో భారత్‌కు భారీ విజయం దక్కింది.
భారత్ చేతిలో మలేసియా చిత్తు
RELATED ARTICLES