టోక్యో పారాలింపిక్స్
టోక్యో: భారత్‌కు టోక్యో ఒలింపిక్స్‌లో శనివారం మరో రెండు స్వ ర్ణాలు సహా మొత్తం నాలుగు పతకాలు లభించాయి. షూటింగ్ పురుషుల పి4 50 మీటర్ల మిక్స్డ్ పిస్టల్ ఎస్‌హెచ్ 1 విభాగంలో మనీష్ నర్వాల్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ప్రారంభం నుంచే అద్భుతమైన ప్రతిభ కనబరచిన అతను తన ప్రత్యర్థులను వెనక్కునెట్టి, అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. నర్వాల్‌తో చివరి వరకూ తీవ్రంగా పోటీపడిన మరో భారత షూటర్ సింగ్‌రాజ్ అధానా రజత పతకాన్ని గెల్చుకున్నాడు. బాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎల్ఎల్ 3 విభాగంలో ప్రమోద్ భగత్ అద్వితీయమైన ఆటతో రాణించాడు. ఫైనల్లో అతను గ్రేట్ బ్రిటన్ ఆటగాడు డానియల్ డెల్హెల్ను ఓడించి భారత్ ఖాతాలో మరో స్వర్ణాన్ని చేర్చాడు. ఇదే విభాగంలో మనోజ్ సర్కార్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. మూడో స్థానానికి జరిగిన ప్లే ఆఫ్ గేమ్‌లో అతను జపాన్ షట్లర్ దైసుకే ఫుజిహరాను ఓడించాడు. మొత్తం మీద భారత్‌కు ఆదివారం నాలుగు పతకాలు లభించగా, మొత్తం పతకాల సంఖ్య 17కు చేరింది. వీటిలో నాలుగు స్వర్ణాలుకాగా, ఏడు రజతాలు, మరో ఆరు కాంస్య పతకాలు ఉన్నాయి.
భారత్ ఖాతాలో… మరో రెండు స్వర్ణాలు
RELATED ARTICLES