హామిల్టన్: న్యూజిలాండ్‌తో జరిగిన చివరి వన్డేలో మిథాలీ సేన 8 వికెట్లతో చిత్తయింది. అయినా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత మహిళా జట్టు 2 కైవసం చేసుకుంది. తొలి రెండు వన్డేల్లో విజయాలు సాధించిన మిథాలీ సేన ఆఖరి మ్యాచ్‌లో మాత్రం తేలిపోయింది. పురుషుల జట్టు మాదిరిగానే సిరీస్ గెలిచిన తర్వాతి మ్యాచ్‌లో ఓటమిపాలైంది. శుక్రవారం జరిగిన మూడో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 44 ఓవర్లలో 149 పరుగులకే ఆలౌటైంది. భారత జట్టులో దీప్తి శర్మ (52) అర్ధ శతకంతో ఒంటరి పోరాటం చేసింది. మిగతా బ్యాట్స్‌వుమెన్స్ ఘోరంగా విఫలమవడంతో టీమిండియా తక్కువ స్కోరుకే పరిమితమైంది. కివీస్ బౌలర్లలో విజృంభించి బౌలింగ్ చేసిన అన్న పీటర్సన్ 4 వికెట్లు పడగొట్టింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన న్యూజిలాండ్ (29.2 ఓవర్లలో) 153/2 పరుగుతో అలవోకగా ఛేదించింది. కివీస్ జట్టులో ఓపెనర్ సుజీ బెట్స్ (57), కెప్టెన్ ఆమీ సాటెర్ట్‌వైట్ (66 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. దీంతో కివీస్ మరో 124 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్లతో ఘన విజయం సాధించింది. భారత్, న్యూజిలాండ్ మహిళల జట్ల మధ్య బుధవారం నుంచి మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్ ప్రారంభం కానుంది.
ఆదిలోనే షాక్..
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. తొలి రెండు వన్డేల్లో చెలరేగి ఆడిన భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధనా ఈ మ్యాచ్‌లో మాత్రం తేలిపోయింది. కుదురుగా ఆడుతున్న మంధనా (1)ను అన్న పీటర్సన్ తొలి వికెట్‌గా పెవిలియన్ పంపింది. ఆ వెంటనే మరో ఓపెనర్ జెమీమా రొడ్రిగ్స్ (20 బంతుల్లో 12)ను తహుహు ఔట్ చేసి భారత్‌కు మరో షాకిచింది. దీంతో టీమిండియా 13 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. తర్వాత దీప్తిశర్మ, భారత సారథి మిథాలీ రాజ్ భారత ఇన్నింగ్స్‌ను ఆదుకునే ప్రయత్నం చేశారు. ఒకవైపు దీప్తి ధాటిగా ఆడితే మరోవైపు మిథాలీ మాత్రం కుదురుగా ఆడింది. మహిళా క్రికెట్ చరిత్రలో అత్యధిక వన్డేలు ఆడి కొత్త చరిత్ర సృష్టించిన హైదరాబాదీ స్టార్ మిథాలీ తన కెరీర్ 200వ వన్డేలో (28 బంతుల్లో 9) పరుగులు మాత్రమే చేసి ఔటైంది. గత మ్యాచ్‌లో రాణించిన మిథాలీ శుక్రవారం జరిగిన ఆఖరి వన్డేలో మాత్రం నిరాశ పరిచింది. ఇక భారత్ 39 పరుగుల వద్ద మూడో వికెట్ చేజార్చుకుంది.
ఆదుకున్న దీప్తి..
తర్వాత వచ్చిన హర్మన్ ప్రీత్ కౌర్‌తో కలిసి దీప్తి శర్మ భారత స్కోరుబోర్డును ముందుకు సాగించింది. వీరిద్దరూ ఆచితూచి ఆడుతూ పరుగులు సాధించారు. తక్కువ స్కోరుకే మూడు వికెట్లు కోల్పోడంతో ఒత్తిడికి లోనైన భారత హార్డ్ హిట్టర్ హర్మన్ తన శైలికి విరుద్ధంగా కుదురుగా ఆడింది. మరోవైపు దీప్తి శర్మ కూడా సింగిల్స్, డబుల్స్ తీస్తూ పోయింది. ఈ క్రమంలోనే భారత్ 15.4 ఓవర్లలో 50 పరుగులు పూర్తి చేసుకుంది. ఈ జోడీ కివీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొటూ సింగిల్స్, డబుల్స్ తీస్తూ స్కోరుబోర్డును ముందుకు నడిపించింది. ఆఖరికి ఈ జంటను విడదీయడానికి కివీస్ బౌలర్లు చేసిన కృషి ఫలించింది. భారత్ స్కోరు 87 పరుగుల వద్ద కుదురుగా ఆడుతున్న హర్మన్ ప్రీత్ కౌర్ (24; 40 బంతుల్లో 2 ఫోర్లు)ను పీటర్సన్ క్లీన్ బౌల్డ్ చేసింది. వీరు నాలుగో వికెట్‌కు కీలకమైన 48 పరుగులు జోడించారు. తర్వాత వచ్చిన డి. హేమలత కూడా సమన్వయంతో ఆడుతూ దీప్తికి అండగా నిలిచింది. వీరిద్దరూ మరో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పే ప్రయత్నం చేశారు. కానీ కివీస్ బౌలర్లు మరోసారి విరుచుకుపడ్డారు. సమన్వయంతో ఆడుతున్న హేమలత 32 బంతుల్లో 13 పరుగులను ఆమెలియా కేర్ తెలివైన బంతితో పల్టీ కొట్టించింది. తర్వాత వచ్చిన వికెట్ కీపర్ తానియా భాటియా (0)ను ఖాతా తెరవకుండానే పెవిలియన్ పంపించింది. దీంతో భారత్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయి మరిన్ని కష్టాల్లో పడిపోయింది. తర్వాత కీలక ఇనింగ్స్ ఆడుతున్న దీప్తి శర్మ హాఫ్ సెంచరీ సాధించింది. ఆ కొద్ది సేపటికే పీటర్సన్ బౌలింగ్‌లో వెనుదిరిగింది. బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేసిన దీప్తి శర్మ 90 బంతుల్లో 2 ఫోర్లతో 52 పరుగులు చేసింది. అనంతరం మరింతగా పుంజుకున్న కివీస్ బౌలర్లు వెనువెంటనే వికెట్లు తీస్తూ టీమిండియాను 44 ఓవర్లలో 149 పరుగులకే పరిమితం చేశారు. విజృంభించి బౌలింగ్ చేసిన అనన పీటర్సన్ 10 ఓవర్లలో 28 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టింది. మరోవైపు తాహుహు మూడు వికెట్లు తీయగా.. ఆమెలియా కేర్ రెండు వికెట్లు దక్కించుకుంది.
భారత్ ఓటమి
RELATED ARTICLES