మూడో వన్డేలోనూ ఓడిన న్యూజిలాండ్-ఎ
అనధికారిక వన్డే సిరీస్
మౌంట్ మాంగనుయ్: భారత్-ఎ, న్యూజిలాండ్-ఎ జట్ల మధ్య జరిగిన అనధికారిక మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. మంగళవారం జరిగిన చివరి వన్డేలో భారత్-ఎ జట్టు 75 పరుగులతో కివీస్ జట్టును ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. భారత జట్టులో అన్మోల్ ప్రీత్ సింగ్ (71; 80 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకంతో చెలరేగాడు. మరోవైపు బవనే (48), విజయ్ శంకర్ (42), ఇషాన్ కిషన్ (39), అక్షర్ పటేల్ (31) పరుగులతో రాణించడంతో భారత్ భారీ స్కోరు చేయగలిగింది. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన న్యూజిలాండ్-ఎ జట్టు 34 పరుగుల వద్ద వోర్కర్ (9) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. తర్వాత మరింతగా పుంజుకున్న భారత బౌలర్లు వరుస విరమాల్లో వికెట్లు తీస్తూ పోయారు. రుథేర్‌ఫోర్డ్ (27), రవింద్ర (21), మిచెల్ (30), సైఫెర్ట్ (55) కొద్ది వరకు పోరాడిన తమ జట్టును విజయాన్ని అందించలేకపోయారు. భారత బౌలర్ల ధాటికి న్యూజిలాండ్-ఎ జట్టు 44.2 ఓవర్లలో 200 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో చెలరేగి బౌలింగ్ చేసిన సిద్ధార్థ్ కౌల్ 4 వికెట్లు పడగొట్టాడు. ఇతర బౌలర్లలో గౌతమ్ రెండు వికెట్లు తీయగా.. ఖలీల్ అహ్మద్, అక్షర్ పటేల్, విజయ్ శంకర్, కృనాల్ పాండ్యా తలొక్క వికెట్ దక్కించుకున్నారు.
భారత్-ఎ క్లీన్ స్వీప్
RELATED ARTICLES