రెండో వన్డేలోనూ ఓడిన న్యూజిలాండ్-ఎ
అనధికారిక వన్డే సిరీస్
మౌంట్ మంగానుయ్: న్యూజిలాండ్-ఎతో జరుగుతున్న అనధికారిక వన్డే సిరీస్‌లో భారత్- వ రుసగా రెండో విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలుండగానే 2- సిరీస్ కైవసం చేసుకుం ది. ఆదివారం ఇక్కడ భారత్-ఎ, న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసి న కివీస్ జట్టులో విల్ యాంగ్ (102; 106 బం తుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), జార్జ్ వొర్కర్ (106 బంతుల్లో 99) పరుగులతో చెలరేగారు. చివర్లో దూకుడుగా ఆడిన మిచెల్ 28 బంతుల్లో 4 సిక్స్ లు, 1 ఫోర్‌తో 45 పరుగులు చేశాడు. దీంతో న్యూజిలాండ్- జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 299 పరుగులు చేసింది. భారత బౌలర్లలో ఖలీల్ అ హ్మద్, నవ్‌దీప్ సైనీ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత్ జట్టు కు ఓపెనర్లు శుబ్‌మాన్ గిల్ (25), మయాంక్ అగర్వాల్ (25) పరుగులు చేసి శుభారంభాన్నిచ్చారు. తర్వాత శ్రేయస్ అయ్యార్, కెప్టెన్ మనీ ష్ పాండే, విజయ్ శంకర్ అద్భుతమైన బ్యాటింగ్‌తో భారత్‌కు గొప్ప విజయాన్ని అందించారు. శ్రేయస్ అయ్యర్ (59; 63 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్), విజయ్ శంకర్ (59; 56 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) పరుగులు చేసి ఔటవ్వగా.. చివ రి వరకు క్రీజులో నిలిచున్న కెప్టెన్ మనీష్ పాండే 109 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 111 పరుగులు చేసి భారత్- మరొక ఓవర్ మిగిలి ఉం డగానే ఐదు వికెట్ల విజయాన్ని అందించాడు.
భారత్-ఎకు సిరీస్
RELATED ARTICLES