తిరువనంతపురం: చైనాను వణికిస్తోన్న కరోనా వైరస్ ఇప్పుడు భారత్‌ను భయపెడుతోంది. ఇప్పటికే కేరళలో కరోనా వైరస్ బారిన పడి ఇద్దరు చికిత్స పొందుతున్నారు. తాజాగా ఈ సంఖ్య మూడుకు చేరింది. కేరళలో మరో కేసు నమోదైనట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కెకె శైలజ కూడా నిర్థారించారు. కేరళ కాన్హన్‌గడ్ జిల్లాలో ఈ కేసు నమోదైంది. ప్రస్తుతం బాధితుడిని ప్రత్యేకంగా ఓ వార్డు లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇదివరకు పాజిటివ్‌గా తేలిని రెండు కేసులు కేరళలోని త్రిస్సూర్, అలఫుళలో వెలుగుచూశాయి. చైనా నుంచి, వైరస్ సోకిన ఇతర దేశాల నుంచి వచ్చిన 1,999 మందిని కేరళలో అబ్జర్వేషన్‌లో పెట్టారు. కేరళలోని వివిధ ఆసుపత్రులలో 75 ప్రత్యేక వార్డు ల్లో వారిని ఉంచారు. మిగిలిని 1,924 మందిని హోం క్వారంటైన్‌లో అబ్జర్వేషన్‌లో పెట్టారు. ఆదివారం వరకు పరీక్షించిన 104 శాంపిల్స్‌లో మూ డు పాజిటివ్‌గా తేలాయి. ఇంటి వద్ద అబ్జర్వేషన్‌లో ఉన్నవారు పబ్లిక్ ఫంక్షన్స్‌లో పాల్గొనకుండా దూరంగా ఉండాలని, తమ 28 రోజుల ఇన్‌క్యూబేష న్ కాలం పూర్తి అయ్యేవరకు వారు ఇంటి బయటికి కూడా పోరాదని కేరళ ఆరోగ్య మంత్రి శైలజ చెప్పారు. టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటుచేసిన కేంద్రం వైరస్ కారణంగా తలెత్తే పరిస్థితిని పర్యవేక్షించేందుకుగాను కేంద్ర ప్ర భుత్వం టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటుచేసింది. ఈ టాస్క్ ఫోర్స్‌లో ఆరోగ్య, హోం, పౌరవిమానయాన, మహిళాశిశు అభివృద్ధి శాఖ మంత్రులున్నారని కేంద్ర మంత్ర జి కిషన్ రెడ్డి సోమవారం చెప్పారు. కేరళలో మూడో వైరస్ కేసు వెలుగుచూడ్డంతో కేంద్రం ఈ చర్య తీసుకుంది. చైనా నుంచి భారత్‌కు వచ్చేయాలనుకునే భారతీయులను తరలిస్తామని కూడా కిషన్ రెడ్డి చెప్పారు
భారత్‌లో మూడో ‘కరోనా’ కేసు!
RELATED ARTICLES