ప్రజాపక్షం/న్యూఢిల్లీ కేంద్ర ప్రభుత్వం ప్రజల నుంచి మరో తీవ్రమైన నిరసనను చవిచూడాల్సి వస్తున్నది. మోడీ సర్కారు అమల్లోకి తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలభారత రైతు సంఘాల సమాఖ్య (ఎఐకెఎస్‌సిసి) ఈనెల 8వ తేదీన భారత్‌బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెల్సిందే. ఈ భారత్‌బంద్‌కు ఐదు వామపక్షాలు, పది కేంద్ర కార్మిక సంఘాలు తమ సంఘీభావం ప్రకటించాయి. ఈ మేరకు శనివారంనాడు వేర్వేరు ప్రకటనలు విడుదల చేశాయి. దేశ వ్యవసాయాన్ని, ఆహారభద్రతను దెబ్బతీసే కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు చేపట్టిన ఆందోళనపై బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు చేస్తున్న దుష్ప్రచారాన్ని సిపిఐ, సిపిఐ(ఎం), సిపిఐ(ఎంఎల్), ఎఐఎఫ్‌బి, ఆర్‌ఎస్‌పిల ప్రధాన కార్యదర్శులు డి.రాజా, సీతారాం ఏచూరి, దీపాంకర్ భట్టాచార్య, దేబబ్రత బిశ్వాస్, మనోజ్ భట్టాచార్య ఒక ఉమ్మడి ప్రకటనలో తీవ్రంగా ఖండించా రు. రైతుల ఆందోళనను సమర్థించారు. వారు 8న చేపట్టిన బంద్‌కు తమ వామపక్షాలు సంపూర్ణ సంఘీభావం తెలియజేస్తున్నాయని తెలిపారు. విద్యుత్ బిల్లును కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇతర రాజకీయ పార్టీలన్నీ ఈ బంద్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కాగా, భారత్‌బంద్‌కు సంఘీభావం తెలియజేస్తూ పది కేంద్ర కార్మికసంఘాలు ఎఐటియుసి, ఐఎన్‌టియుసి, హెచ్‌ఎంఎస్, సిఐటియు, ఎఐయుటియుసి, టియుసిసి, ఎస్‌ఇడబ్ల్యు, ఎఐసిసిటియు, ఎల్‌పిఎఫ్, యుటియుసి ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. రైతుల ఆందోళన భవిష్యత్ ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నాయి. నవంబర్ 27వ తేదీ నుంచి అన్ని కార్మిక సంఘాలు దేశంలో ఒక్కడో ఒక చోట రైతులకు సంఘీభావంగా ఆందోళనలు చేస్తూనే వున్నాయని తెలిపింది. 8న బంద్‌ను జయప్రదం చేయాల్సిందిగా ఈ సంఘాలు పిలుపునిచ్చాయి
భారత్‌బంద్‌కు వామపక్షాలు, కేంద్ర కార్మిక సంఘాలు సంఘీభావం
RELATED ARTICLES