తొలి రౌండ్‌లోనే ఇంటి దారిపట్టిన స్టార్ షట్లర్లు
థాయ్‌లాండ్ మస్టర్స్ బాడ్మింటన్ టోర్నీ
బ్యాంకాక్ : భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ల పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే ఈ సీజన్ ప్రారంభ టోర్నీలైన మలేసియా మాస్టర్స్, ఇండోనేసియా మాస్టర్స్‌లో ఘోరపరాభావానికి గురైన భారత షట్లర్లు.. తాజాగా బుధవారం ప్రారంభమైన థాయ్‌లాండ్ మాస్టర్స్‌లో త్రీవంగా నిరాశపరిచారు. తొలిరోజే తమ పోరాటాన్ని ముగించి ఇంటిదారి పట్టారు. బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్ నేపథ్యంలో ఈ టోర్నీకి హైదరాబాద్ స్టార్ షట్లర్ పీవీ సింధు దూరంగా ఉండగా.. తమ ఒలింపిక్స్ బెర్త్‌లపై నీలినీడలు కమ్ముకున్న నేపథ్యంలో సైనా నేహ్వాల్, కిదాంబి శ్రీకాంత్‌లు బరిలోకి దిగారు. వీరితో పాటు హెచ్‌ఎస్ ప్రణయ్ సమీర్ వర్మలు పాల్గొన్నారు..
సైనా, శ్రీకాంత్ ఔట్..
బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌లో ఇండియా స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ 13-21,21-17,15-21తో డెన్మార్క్‌కు చెందిన లైన్ హజ్మార్క్ చేతిలో ఓడి నిరాశపరిచింది. 47 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సైనా రెండో గేమ్‌లో గెలిచి రేసులో నిలిచినా.. ప్రత్యర్థి జోరు ముందు నిలవలేకపోయింది. పురుషుల సింగిల్స్‌లో ఐదో సీడ్ కిదాంబి శ్రీకాంత్ 21-12, 14-21, 11-21తో ఆతిథ్య ప్లేయర్ శెసర్ హిరెన్ రుస్తావిటో చేతిలో ఖంగుతిన్నాడు. 48 నిమిషాలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్ నెగ్గి ఆధిపత్యం కనబర్చిన శ్రీకాంత్.. తర్వాత తీసికట్టిన ఆటతీరుతో వరుస గేమ్‌ల్లో ఓడి పరాజయం పాలయ్యాడు. తొలి రౌండ్‌లోనే నిష్క్రమించడం ఈ ఏడాది శ్రీకాంత్‌కుమూడోసారి కాగా..రుస్తావిటో చేతిలో ఓడటం వరుసగా రెండోసారి. ప్రస్తుతం 23వ ర్యాంకులో ఉన్న శ్రీకాంత్, 22వ ర్యాంకర్ సైనా టోక్యో ఒలింపిక్స్ బెర్త్ దక్కాలంటే.. మెగాటోర్నీ కటాఫ్ డేట్ ఎప్రిల్ 26లోపు టాప్-16 ర్యాంకు అందుకోవాలి. అయితే కటాఫ్ డేట్‌లోగా జరిగే 10 టోర్నీల్లో కనీసం ఆరు టోర్నీల్లో సెమీఫైనల్‌కు చేరాలి. కానీ శ్రీకాంత్, సైనా ఇప్పటికే వరుసగా మూడు టోర్నీల్లో ఓడారు. దీంతో వారి ఒలింపిక్స్ బెర్త్ల్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి.
సమీర్, ప్రణయ్ కూడా..
ఇతర మ్యాచ్‌ల్లో సమీర్ వర్మ, ప్రణయ్ వర్మ కూడా తొలి రౌండ్‌లోనే ఓడి నిష్క్రమించారు. మలేషియా ప్లేయర్ లీ జీ జియా చేతిలో 21-16, 21-15తో సమీర్ వర్మ పరాజయం పాలవ్వగా.. ప్రణయ్ 17-21, 22-20,19-21తో మలేషియాకే చెందిన లూయి డారెన్ చేతిలో పోరాడి ఓడాడు. ఇక మహిళల సింగిల్స్‌లో బరిలోకి దిగిన సైనా నెహ్వాల్.. డెన్మార్క్‌కు చెందిన లైన్ హజ్మార్క్‌తో తలపడనుంది.
భారత్‌కు పరాభావం
RELATED ARTICLES