దుబాయి : ఐదు టీ-20ల సిరీస్‌ను 5- తేడాతో కైవసం చేసుకుని దూకుడు మీదున్న టీమిండియాకు తొలి వన్డేలో బ్రేక్‌లు వేసింది న్యూజిలా్‌ండ జట్టు… తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు భారీ స్కోర్ చేసింది.. శ్రేయాస్ అయ్యర్ (103) రాహుల్ (88) కోహ్లీ (51) రాణించడంతో ఇండియా జట్టు నిర్ణిత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 347 పరుగులు చేసింది.. ఇక, 348 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలా్‌ండ జట్టు 11 బంతులు మిగిలి ఉండగానే ఆరు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించి తొలి వన్డేలో విజయం సాధించింది. ఇక, అసలే ఓటమి చవిచూసిన మ్యాచ్‌లో.. మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా… 80 శాతం ఫైన్ విధించింది ఐసీసీ… న్యూజిలా్‌ండఇండియా మధ్య ఇవాళ జరిగిన హామిల్టన్‌లో జరిగిన తొలి వన్డేలో స్లో ఓవర్ రేటు కారణంగా.. భారత్‌కు జరిమానా విధించింది ఐసీసీ.. ఆన్-ఫీల్డ్ అంపైర్లు షాన్ హేగ్, లాంగ్టన్ రుసెరె, థర్డ్ అంపైర్ బ్రూస్ ఆక్సెన్ఫోర్డ్ ఫోర్త్ అంపైర్ క్రిస్ బ్రౌన్ ఆరోపణల తర్వాత మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రా్‌డ దీనిపై ఆరా తీశారు.. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ దీనిని అంగీకరించడంతో.. ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 80 శాతం కోత విధిస్తున్నట్టు ప్రకటించింది ఐసీసీ.
భారత్‌కు ఐసిసి షాక్
RELATED ARTICLES