సంక్షేమబోర్డు నిధులను ప్రభుత్వం దారి మళ్లించడం సరికాదు
బోర్డు నుంచి కార్మికులను ఆదుకోండి
కార్మికశాఖ కమిషనర్‌కు అఖిలపక్షం వినతి
ప్రజాపక్షం/హైదరాబాద్: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నుండి కార్మికులను ఆదుకోవాలని అఖిలపక్షం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కార్మికులను ఆదుకునేందుకు ప్రత్యేకంగా ఏర్పడిన సంక్షేమ బోర్డు నిధులను ప్రభుత్వం దారి మళ్లించడం ఏమిటని ప్రశ్నించింది. సంక్షేమ నిధి నుండి రూ.5 వేలు ఇవ్వాలన్నది. లాక్‌డౌన్ సందర్భంగా పేదలతో పాటు భవన నిర్మాణ కార్మికులకు అదనంగా రూ 1500 సాయం చేస్తామని ప్రకటించి, ఇప్పటి వరకు ఒక్క పైసా సహాయం చేయలేదని విమర్శించింది. సంక్షేమ నిధుల నుండి భవన నిర్మాణ కార్మికులకు ఆర్థిక సాయం చేయాలని, వారిని ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, టిజెఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం.కోదండరామ్, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంఎల్‌సి రాములు నాయక్,తెలంగాణ ఇంటి పార్టీ నాయకులు రామయ్య, తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షుడు ఉజ్జిని రత్నాకర్‌రావు, ప్రధాన కార్యదర్శి మారగోని ప్రవీణ్‌కుమార్‌లోతో కూడిన ప్రతినిధి బృందం హైదరాబాద్‌లోని బిఆర్‌కె భవన్‌లో కార్మికశాఖ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్మికుల కోసం ఏర్పాటు చేసిన నిధులను వారి సంక్షేమం కోసమే ఖర్చు చేయాలని, మిగతా రాష్ట్రాల్లో కూడా అలాగే చేస్తున్నారని, ఒక పద్దు నిధులు మరో పద్దుకు బదిలీ అన్యాయమని వారు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని క్యాబినెట్ దృష్టికి తీసుకెళ్తానని కమిషనర్ హామీనిచ్చినట్టు ప్రతినిధులు తెలిపారు. కాగా అంతకుముందు కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ చతుర్వేదికి కూడా వినతిప త్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికుల సంఘం నా యకులు ప్రవీన్‌కుమార్, టిజెఎస్ నాయకులు ఎం.నర్సయ్యగౌడ్ పాల్గొన్నారు.
‘అత్త సొమ్ము అల్లుడు దానం’ చందంగా కార్మిక నిధులను దారి మళ్లీంచారు : చాడ
అత్త సొమ్ము అల్లుడు దానం చేసిన చందంగా భవన నిర్మాణ కార్మిక సంక్షే మ బోర్డుకు చెందిన రూ. వెయ్యి కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం పౌరసర ఫరాల శాఖకు బదిలీ చేసిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. కేరళ, ఢిల్లీ తరహా అనేక రాష్ట్రాల్లో భవన కార్మికులకు ప్రత్యేకంగా అక్కడి ప్రభుత్వాలు ఆర్థిక సాయం చేస్తే, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. పేదలతో పాటు భవన నిర్మాణ కా ర్మికులకు అదనంగా రూ.1500 ఇస్తానని సిఎం హామీనిచ్చినప్పటికీ.. ఇప్పటి వరకు ఒక్కపైసా సాయం జరగలేదన్నారు. భవన నిర్మాణ సంక్షేమ నిధి బోర్డ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 15లక్షల మంది కార్మికులు తమ పేర్లను న మోదు చేసుకున్నారని, వారి తమ బ్యాంక్ ఖాతాలు, ఆధార్‌కార్డులను కూ డా అనుసంధానం చేశారని వివరించారు. రా ష్ట్రంలో ఎవరు ఆకలితో చా వొద్దని చెప్పిన కెసిఆర్, భవన నిర్మాణ కార్మి కులకు రూపాయి ఇవ్వలేద న్నారు. తెల్ల కార్డుదారులకు కూడా అందరికీ రూ. 1500, బియ్యం అంద లేదన్నారు. 8 లక్షల కార్డుదారులకు ప్రభుత్వ సాయం అందలేద న్నారు. కార్మికులకు ఒక్క పైసా సాయం చేయకపోవడం దారుణమని, భవన నిర్మాణ కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని చెప్పారు.
కార్మికులకు ఆదుకోకుంటే లాక్‌డౌన్‌ను బ్రేక్‌డౌన్ చేస్తాం : ఎల్.రమణ
భవన నిర్మాణ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోకుంటే లాక్‌డౌన్‌ను బ్రేక్ డౌన్ చేసైనా వారికి న్యాయం జరిగేలా పోరాడుతామని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు ఎల్.రమణ హెచ్చరించారు. కార్మికుల శ్రేయస్సు కొరకు ఏర్పాటు చేసిన సంక్షే మ బోర్డు ఆ కార్మికుల కోసమే పని చేయాలని, కానీ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతా రహితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కార్మికులను పట్టించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనా ఉంటుందని, కార్మికుల కన్నెర్ర చేస్తే కెసిఆర్ కాల గర్భంలో కలుస్తారని హెచ్చరించారు.
కార్మికులను ప్రభుత్వమే ఆదుకోవాలి : కోదండరామ్
భవన నిర్మాణ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని టిజెఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ ఎం.కోదండరామ్ డిమాండ్ చేశారు. అసంఘటిత రంగ కార్మికు ల కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలన్నారు. కార్మికులకు రూ.1500 ఇస్తామని స్వయంగా సిఎం ప్రకటించి, ఆ పైసలు కూడా ఇవ్వ కపోవడం అన్యాయమని పేర్కొన్నారు. భవన నిర్మాణ కార్మికులకు రూ. 5 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారిని ప్రభుత్వం అదుకోకపోవడం చాలా అన్యాయమన్నారు.
అబద్ధాల్లో కెసిఆర్ నెంబర్ వన్ : నాయక్
మాటలు, అబద్ధాల్లో సిఎం కెసిఆర్ నెంబర్ వన్ అని కాంగ్రెస్ నేత, మాజీ ఎంఎల్‌సి రాములు నాయక్ ఆరోపించారు. భవన కార్మికులను ఆదుకోవా లని తాము అనేక మార్లు అధికారులకు వినతిపత్రాలు సమర్పించినా పట్టిం చుకోలేదన్నారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాలలో భవన నిర్మాణ కార్మికులకు అక్కడి ప్రభుత్వాలు ఆర్థిక సాయం చేస్తుందని గుర్తు చేశారు.