‘పెగాసస్’పై మారని విపక్షాల డిమాండ్
ప్రాధాన్యం లేని అంశమని సర్కార్ వ్యాఖ్య
పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రతిష్టంభన కొనసాగే అవకాశం
న్యూఢిల్లీ : పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఎలాంటి చర్చలు లేకుండానే ముగిసే ప్రమాదం కనిపిస్తున్నది. యావత్ దేశాన్ని కుదిపేసిన పెగాసస్ ఉదంతంపై చర్చ జరగాల్సిందేనని వామపక్షాలు సహా పలు విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఉభయ సభల్లోనూ వాయిదా తీర్మానాలను కూడా ఇచ్చాయి. పెగాసస్ స్పైవేర్ సాయంతో దేశంలోని సుమారు 300 మంది ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్‌కు గురయ్యాయని అంతర్జాతీయ మీడియాలో వచ్చిన వార్తాకథనాలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. బాధితుల్లో రాజకీయ నాయకులు, మంత్రులు, న్యాయమూర్తులు, సామాజిక కార్యకర్తలు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు కూడా ఉన్నారని ‘ది వైర్’తోపాటు వివిధ పత్రికలు స్పష్టం చేశాయి. కాగా, వ్యక్తిగత స్వేచ్ఛతోపాటు దేశ సమైక్యతకు, సమగ్రతకు కూడా ఈ స్పైవేర్ ప్రమాదకారిగా మారుతుందని విపక్షాలు హెచ్చరిస్తున్నాయి. అందుకే ఈ అంశంపై చర్చకు పట్టుబడుతున్నాయి. అయితే, ఇది ఒక సమస్య కానేకాదని, ఏమాత్రం ప్రాధాన్యం లేని అంశమని సర్కారు వ్యాఖ్యానిస్తున్నది. విపక్షాలు కోరుతున్న విధంగా చర్చకు అంగీకరించకుండా మొండివైఖరిని ప్రదర్శిస్తున్నది. విపక్షాలే ప్రతిష్టంభనకు కారణమని పేర్కొంటూ క్లీన్‌చిట్ పొందే ప్రయత్నం చేస్తున్నది. నిజంగానే పెగాసస్ వ్యవహారానికి ఎలాంటి ప్రాధాన్యం లేకపోతే, చర్చకు భయమెందుకు? చర్చకు ముందుకు రావడానికి జంకు ఎందుకు? అని ప్రతిపక్ష పార్టీలు నిలదీస్తున్నాయి. ఇప్పటికే పార్లమెంటు సమావేశాలు ప్రారంభమై రెండు వారాలు గడిచిపోయాయి. మరో రెండు వారాల సమయం ఉంది. సోమవారం నుంచి ప్రారంభమయ్యే మూడో వారం సమావేశాల్లోనైనా అర్థమంతమైన చర్చ జరుగుతుందా అన్నది అనుమానంగానే ఉంది.
ప్రజా సమస్యలంటే ఏమిటో?
మోడీ సర్కారు దృష్టిలో ప్రజా సమస్యలు అంటే ఏమిటో అర్థంగాని పరిస్థితి నెలకొంది. పెగాసస్‌తోపాటు రైతు సమస్యలు, ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం వంటి కీలక అంశాలపై చర్చకు విపక్షాలు వాయిదా తీర్మానాలను కూడా ఇచ్చాయి. కానీ, ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. ప్రతిపక్ష పార్టీలన్నీ ఉద్దేశంగా సభా కార్యకలాపాలను జరగనీయకుండా అడ్డుకుంటున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ప్రస్తావించాలి. రైతులు ఎనిమిదిన్నర నెలలుగా చేస్తున్న ఆందోళనలు ప్రనుత్వం దృష్టిలో సమస్యగా కనిపించడం లేదు. ఈ కాలంలో ఎంత మంది రైతులు మృతి చెందారన్న సమాచారం కూడా లేదని ప్రకటించి చేతులు దులిపేసుకున్న సర్కారుకు, వాస్తవాలను, మరణాల లెక్కను నిగ్గుతేల్చడానికి సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జెపిసి)ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపక్ష పార్టీల డిమాండ్‌కు ప్రాధాన్యత లేదు. జెపిసి గురించి లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాసినప్పటికీ చలనం లేదు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసి, జెపిసి విషయంలో జోక్యం చేసుకోవాలని ప్రతిపక్ష పార్టీల నేతలు ఇప్పటికే కోరారు. ఆయన ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. రైతుల సమస్యలనే కాకుండా, పెట్రో ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం వంటి అంశాలపై చర్చను విపక్షాలు కోరుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలన్నీ కూడగట్టుకొని సభా కార్యకలాపాలు జరగకుండా అడ్డుకుంటున్నాయని ఆరోపించిన ప్రహ్లాద్ జోషి అంతకంటే కీలకమైన ప్రజాసమస్యలు చాలా ఉన్నాయని, వాటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆయన దృష్టిలో పెగాసస్ ఉదంతం, రైతు సమస్యలు, పెట్రో ధరలు, ద్రవ్యోల్బణ పరిస్థితులు ప్రజాసమస్యలు కానప్పుడు పార్లమెంటు ఏ ఏ అంశాలపై చర్చ జరుపుతుందనేది ప్రశ్న. ప్రస్తుతానికి ఈ ప్రశ్నకు సమాధానం లేదు. రెండు రోజుల విరామం తర్వాత సోమవారం నుంచి ప్రారంభమయ్యే సమావేశాల్లో కార్యకలపాలు సజావుగా సాగేలా ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు ఉంటాయో చూడాలి. సానుకూల పరిస్థితులు ఉంటాయని, ఉభయ సభల్లో చర్చకు అనుమతి లభిస్తుందని అనుకోవడం అత్యాశే అవుతుంది. కానేకాదని, ఏమాత్రం ప్రాధాన్యం లేని అంశమని సర్కారు వ్యాఖ్యానిస్తున్నది. విపక్షాలు కోరుతున్న విధంగా చర్చకు అంగీకరించకుండా మొండివైఖరిని ప్రదర్శిస్తున్నది. విపక్షాలే ప్రతిష్టంభనకు కారణమని పేర్కొంటూ క్లీన్‌చిట్ పొందే ప్రయత్నం చేస్తున్నది. నిజంగానే పెగాసస్ వ్యవహారానికి ఎలాంటి ప్రాధాన్యం లేకపోతే, చర్చకు భయమెందుకు? చర్చకు ముందుకు రావడానికి జంకు ఎందుకు? అని ప్రతిపక్ష పార్టీలు నిలదీస్తున్నాయి. ఇప్పటికే పార్లమెంటు సమావేశాలు ప్రారంభమై రెండు వారాలు గడిచిపోయాయి. మరో రెండు వారాల సమయం ఉంది. సోమవారం నుంచి ప్రారంభమయ్యే మూడో వారం సమావేశాల్లోనైనా అర్థమంతమైన చర్చ జరుగుతుందా అన్నది అనుమానంగానే ఉంది.
ప్రజా సమస్యలంటే ఏమిటో?
మోడీ సర్కారు దృష్టిలో ప్రజా సమస్యలు అంటే ఏమిటో అర్థంగాని పరిస్థితి నెలకొంది. పెగాసస్‌తోపాటు రైతు సమస్యలు, ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం వంటి కీలక అంశాలపై చర్చకు విపక్షాలు వాయిదా తీర్మానాలను కూడా ఇచ్చాయి. కానీ, ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. ప్రతిపక్ష పార్టీలన్నీ ఉద్దేశంగా సభా కార్యకలాపాలను జరగనీయకుండా అడ్డుకుంటున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ప్రస్తావించాలి. రైతులు ఎనిమిదిన్నర నెలలుగా చేస్తున్న ఆందోళనలు ప్రనుత్వం దృష్టిలో సమస్యగా కనిపించడం లేదు. ఈ కాలంలో ఎంత మంది రైతులు మృతి చెందారన్న సమాచారం కూడా లేదని ప్రకటించి చేతులు దులిపేసుకున్న సర్కారుకు, వాస్తవాలను, మరణాల లెక్కను నిగ్గుతేల్చడానికి సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జెపిసి)ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపక్ష పార్టీల డిమాండ్‌కు ప్రాధాన్యత లేదు. జెపిసి గురించి లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాసినప్పటికీ చలనం లేదు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసి, జెపిసి విషయంలో జోక్యం చేసుకోవాలని ప్రతిపక్ష పార్టీల నేతలు ఇప్పటికే కోరారు. ఆయన ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. రైతుల సమస్యలనే కాకుండా, పెట్రో ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం వంటి అంశాలపై చర్చను విపక్షాలు కోరుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలన్నీ కూడగట్టుకొని సభా కార్యకలాపాలు జరగకుండా అడ్డుకుంటున్నాయని ఆరోపించిన ప్రహ్లాద్ జోషి అంతకంటే కీలకమైన ప్రజాసమస్యలు చాలా ఉన్నాయని, వాటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆయన దృష్టిలో పెగాసస్ ఉదంతం, రైతు సమస్యలు, పెట్రో ధరలు, ద్రవ్యోల్బణ పరిస్థితులు ప్రజాసమస్యలు కానప్పుడు పార్లమెంటు ఏ ఏ అంశాలపై చర్చ జరుపుతుందనేది ప్రశ్న. ప్రస్తుతానికి ఈ ప్రశ్నకు సమాధానం లేదు. రెండు రోజుల విరామం తర్వాత సోమవారం నుంచి ప్రారంభమయ్యే సమావేశాల్లో కార్యకలపాలు సజావుగా సాగేలా ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు ఉంటాయో చూడాలి. సానుకూల పరిస్థితులు ఉంటాయని, ఉభయ సభల్లో చర్చకు అనుమతి లభిస్తుందని అనుకోవడం అత్యాశే అవుతుంది.
భయమెందుకు? రా చర్చకు..
RELATED ARTICLES