నేడు తుపానుగా మారనున్న ఉపరితల ఆవర్తనం
పలు రాష్ట్రాలను అప్రమత్తం చేసిన వాతావరణ శాఖ
పరిస్థితిని అధికారులతో సమీక్షించిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : తూర్పుమధ్య ఉపరితల ఆవర్తనం సోమవారం నాటికి తుపానుగా మారనుంది. ‘యాస్’గా పిలిచే ఈ తుపాను కారణంగా పలు రాష్ట్రాల్లో తేలికపాటి జల్లుల నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) ప్రకటించింది. పలు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కాగా, తుపాను హెచ్చరికల నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలు, సన్నద్ధతపై జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ, ఇతర విభాగాల ఉన్నతాధికారులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ తుపాను ప్రభావం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో స్వల్పంగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఈ ఉపరితర ఆవర్తనం మధ్య ట్రోపోస్పియరిక్ స్థాయివరకు వ్యాపిం చి స్థిరంగా కొనసాగుతోంది. ఇది వాయుగుండంగా కేంద్రీకృతమై, సోమవారం నాటి కి తుపానుగా, ఆతర్వాత 24 గంటల్లో అతి తీవ్రమైన తుపానుగా మారవచ్చని ఐఎండి హెచ్చరించింది. ఇది ఉత్తర వాయువ్య దిశగా కదిలి, మరింత బలపడి, చివరికి పశ్చిమ బెంగాల్ ఒడిశా మధ్య ఈనెల 26వ తేదీ నాటికి తీరం దాటవచ్చని వివరించింది. యాస్ తుపాను ప్రభావం తీవ్రంగా ఉండే రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఇలావుంటే, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, అండమాన్, తమిళనాడు రాష్టాల సిఎలకు వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి లేఖలు రాశారు. తూర్పు కోస్తా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు తలెత్తే ప్రమాదం ఉందని కేంద్రం తెలిపింది. ప్రజారోగ్యంపై నీళ్లు, దోమలు, గాలి ద్వారా సంక్రమించే వ్యాధులు మరిన్ని సవాల్ విసిరే అవకాశాలున్నాయని కేంద్రం హెచ్చరించింది. అత్యవసర సేవలకు అంతరాయం కలుగకుండా చూసుకోవాలని, మందులను నిల్వ చేసుకోవాలని సూచించింది. కొవిడ్ మహమ్మారి ఉధృతి తీవ్రంగా ఉన్నకారణంగా, ప్రజా రోగ్యాన్ని మరింత ప్రభావితం చేసే రీతిలో ముంచుకొస్తున్న యాస్ తుపాను పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇతరత్రా అంటు వ్యాధులు ప్రబలకుండా అన్ని రకాలుగా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరింది. ఇలావుంటే, ’యాస్’ తుపానును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలపై ప్రధాని మోడీ ఆదివారం వివిధ శాఖలకు చెందిన అధికారులతో సమీక్షా సమావేశం నిర్విచారు. కొవిడ్ బాధితులకు, ప్రత్యేకించి ముంపు ప్రాంతాల్లో ఉన్న వారికి తుపాను సమయంలో ఎలాంటి ఇబ్బంది కలుగకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ తుపాను ప్రభావం ఎక్కువగా ఒడిశా, పశ్చిమ బెంగాల్‌పై ఉండవచ్చని ఐఎండి అంచనా వేసిన విషయాన్ని పరిగణలోకి తీసుకొని, ఈ రెండు రాష్ట్రాలు అన్ని రకాలుగా సిద్దం కావాలని సూచించారు. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ అధికారులతో పాటు టెలికాం, విద్యుత్, పౌరవిమానయాన శాఖల అధికారులు పాల్గొన్నారు. వర్చువల్ పద్ధతిలో జరిగిన ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా హాజరయ్యారు. కాగా, యాస్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఎన్‌డిఆర్‌ఎఫ్‌తోపాటు భారత సైన్యం కూడా సహాయక చర్యలకు సిద్ధమైంది. మరోవైపు ప్రభావిత రాష్ట్రాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాలను చేపట్టేందుకు భారత వాయుసేన సన్నద్ధమైంది.
తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం స్వల్పమే
హైదరాబాద్ ః యాస్ తుపాను ప్రభావం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగానే ఉంటుందని తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దక్షిణ తెలంగాణలో ఒకటి, రెండు చోట్ల ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురియవచ్చని పేర్కొంది. అదే విధంగా, సోమవారం ఉదయం కోస్తాంధ్రలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఉత్తరాంధ్రలో చెదురుమదురు జల్లులు కురుస్తాయని పేర్కొంది. తుపాను కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని స్పష్టం చేసింది. నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా కదులుతున్నాయని, ప్రస్తుతం తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు వ్యాపించి ఉన్నాయని వివరించింది. కాగా, యాస్ రూపంలో వస్తున్న తుపాన్ ను ఎదుర్కొనేందుకు ఎపి ప్రభుత్వం సిద్ధమైంది. వేటకు వెళ్లిన వారిని రప్పిస్తోంది. బోట్లను తీరాలకు చేరుస్తున్నారు. తుపాన్ ప్రయాణించే దారిని బట్టి నేవీ, ఫైర్, విద్యుత్ శాఖలతో అధికారులు సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు.
ప్రభావం తీవ్రంగా ఉండే రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఇలావుంటే, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, అండమాన్, తమిళనాడు రాష్టాల సిఎలకు వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి లేఖలు రాశారు. తూర్పు కోస్తా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు తలెత్తే ప్రమాదం ఉందని కేంద్రం తెలిపింది. ప్రజారోగ్యంపై నీళ్లు, దోమలు, గాలి ద్వారా సంక్రమించే వ్యాధులు మరిన్ని సవాల్ విసిరే అవకాశాలున్నాయని కేంద్రం హెచ్చరించింది. అత్యవసర సేవలకు అంతరాయం కలుగకుండా చూసుకోవాలని, మందులను నిల్వ చేసుకోవాలని సూచించింది. కొవిడ్ మహమ్మారి ఉధృతి తీవ్రంగా ఉన్నకారణంగా, ప్రజా రోగ్యాన్ని మరింత ప్రభావితం చేసే రీతిలో ముంచుకొస్తున్న యాస్ తుపాను పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇతరత్రా అంటు వ్యాధులు ప్రబలకుండా అన్ని రకాలుగా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరింది. ఇలావుంటే, ’యాస్’ తుపానును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలపై ప్రధాని మోడీ ఆదివారం వివిధ శాఖలకు చెందిన అధికారులతో సమీక్షా సమావేశం నిర్విచారు. కొవిడ్ బాధితులకు, ప్రత్యేకించి ముంపు ప్రాంతాల్లో ఉన్న వారికి తుపాను సమయంలో ఎలాంటి ఇబ్బంది కలుగకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ తుపాను ప్రభావం ఎక్కువగా ఒడిశా, పశ్చిమ బెంగాల్‌పై ఉండవచ్చని ఐఎండి అంచనా వేసిన విషయాన్ని పరిగణలోకి తీసుకొని, ఈ రెండు రాష్ట్రాలు అన్ని రకాలుగా సిద్దం కావాలని సూచించారు. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ అధికారులతో పాటు టెలికాం, విద్యుత్, పౌరవిమానయాన శాఖల అధికారులు పాల్గొన్నారు. వర్చువల్ పద్ధతిలో జరిగిన ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా హాజరయ్యారు. కాగా, యాస్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఎన్‌డిఆర్‌ఎఫ్‌తోపాటు భారత సైన్యం కూడా సహాయక చర్యలకు సిద్ధమైంది. మరోవైపు ప్రభావిత రాష్ట్రాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాలను చేపట్టేందుకు భారత వాయుసేన సన్నద్ధమైంది.
భయపెడుతున్న యాస్
RELATED ARTICLES