దుబాయ్: ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాలతో సంబంధాలను తెం చుకోవాలని కోరుతూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) రాసిన లేఖపై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) స్పందించింది. ఉగ్రవాదాన్ని ప్రో త్సహిస్తున్న దేశాలతో క్రికెట్ సంబంధాలను నిలిపివేయాలని కోరుతూ ఐసి సికి బిసిసిఐ లేఖ రాసింది. ఈ క్రమంలోనే వరర్డ్ కప్‌లో తమ ఆటగాళ్లకు ప టిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఐసిసికి విన్నవించింది. దీనిపై స్పందిం చిన ఐసిసి.. ఆటగాళ్ల భద్రతే తమ మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేసింది. ఈ విషయంలో బిసిసిఐ ఎలాంటి ఆందోళన చెందాల్సి అవసరం లేదని పేర్కొంది. బిసిసిఐ రాసిన లేఖ మాకు చేరింది. ఇంగ్లాండ్ వేదికగా జరిగే వర ల్డ్‌కప్‌లో గట్టి భధ్రత ఏర్పాట్లూ చేస్తున్నామని ఆటగాళ్ల భద్రతల గురించి ఆందోళన అవసరం లేదని ఐసిసి చైర్మన్ శశాంక్ మనోహర్ స్పష్టం చేశాడు.
భద్రతపై ఆందోళన వద్దు : ఐసిసి
RELATED ARTICLES