న్యూఢిల్లీ : ఏషియన్, కామన్వెల్త్ ఆటల్లో స్వర్ణ పథక విజేత అయిన రెస్లర్ భజరంగ్ పూనియాను దేశ అత్యంత ప్రతిష్ఠాత్మక క్రీడా అవార్డ్ రాజీవ్ ఖేల్‌రత్నకు శుక్రవారం నామినేట్ చేశారు.12 మంది సెలెక్షన్ కమిటీ సభ్యులు ఈమేరకు పూనియా పేరును ప్రతిపాధించారు. రెండు రోజులుగా సమావేశమయిన 12 మంది సభ్యుల కమిటీ ద్రోణాచార్య, అర్జున అవార్డులకు కూడా క్రీడాకారుల ఎంపికపై చర్చించినట్లుగా అధికారులు వెల్లడించారు. ఈ విషయంపై భజరంగ్ పూనియా ఆనందాన్ని వ్యక్తం చేశారు. అవార్డులు మరింత బాధ్యతను పెంచుతాయన్నారు. గడిచిన సంవత్సరం 65 కేజీల విభాగంలో పూనియా ఏసియా గేమ్స్ల్లో స్వర్ణాన్ని సాధించిన విషయం తెలిసిందే. అదేవిధంగా కామన్వెల్త్ గేమ్స్‌లో కూడా స్వర్ణాన్ని కైవసం చేసుకున్నారు.
భజరంగ్ పూనియాకు రాజీవ్ ఖేల్‌రత్న
RELATED ARTICLES