వైట్‌హౌస్ వద్ద అగ్నికీలలు
ఉద్రిక్తత… జనంపై పోలీసుల జులుం
20 రాష్ట్రాల్లో 145 నగరాల్లో ఆందోళనలు
40 నగరాల్లో కర్ఫ్యూ
వాషింగ్టన్ : జాతి విద్వేషాలతో అమెరికా అట్టుడికిపోతోంది. నల్లజాతీయులపై శ్వేతజాతీయుల జాత్యాహంకారం ముదిరిపోవడంతో ఒక్కసారిగా అమెరికా నిరసన జ్వాలల్లో రగిలిపోతున్నది. నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతికి నిరసనగా అమెరికాలో రాజుకున్న నిరసన జ్వాలలు తాజా గా అధ్యక్ష భవనం శ్వేతసౌధాన్ని బలంగా తాకా యి. నిరసనకారులు శ్వేతసౌధాన్ని ముట్టడించి, లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఆందోళనకారులను అడ్డుకోవడానికి భద్రతా బగాలు బలప్రయో గం చేశాయి. ఈ క్రమంలో నిరసనకారులు అక్కడ చెత్తకు నిప్పుపెట్టడంతో వైట్‌హైస్ వద్ద ఒక్కసారిగా తిరుగుబాటు వాతావరణం అలుముకున్నది. ‘ఐ కాంట్ బ్రీత్’ అనే నినాదం అగ్రరాజ్య వీధుల్లో మారుమోగుతోంది. ఈ క్రమంలో వేలాదిమంది ఆందోళనకారులు ఆదివారం రాత్రి వైట్‌హౌస్ వద్దకు తరలివచ్చారు. ఆందోళనకారులు అధ్యక్ష భవనం సమీపంలో చెత్త కుప్పకు నిప్పుపెట్టారు. భారీగా ఉన్న బందోబస్తును చీల్చుకుంటూ అధ్యక్ష భవనంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఆందోళనలు ఉద్రిక్తంగా మారడంలో ముందస్తు జాగ్రత్తగా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను సీక్రెట్ ఏజెన్సీ రహస్య బంకర్లోకి పంపింది. సుమారు గంటపాటు ట్రంప్ అదే బంకర్లో తలదాచుకున్నారు. అధ్యక్ష భవనం ముందు పరిస్థితి అదుపు తప్పడంలో నేషనల్ గార్డ్ బలగాలను రంగంలోకి దించారు. దీంతో ఆందోళకారులు, పోలీసు లు మధ్య ఘర్షణ యుద్ధరంగాన్ని తలపించింది. ఈ క్రమంలో పదుల సం ఖ్యలో నిరసకారులు తీవ్ర గాయాల పాలయ్యారు. కాగా మినియాపొలిస్ పోలీస్ కస్టడీలో ప్రాణాలో కోల్పోయిన జార్జ్ ఫ్లాయిడ్ మృతిని నిరసిస్తూ నూయార్క్ నుంచి లాక్ఎంజెల్స్ వరకు మొత్తం 145 నగరాల్లో ఆందోళన లు తీవ్ర రూపందాల్చాయి. 40 నగరాల్లో కర్ఫ్యూ విధించారు. అయితే నిరసల్లో పాల్గొన్న వారిని ట్రంప్ దుండగులుగా అభివర్ణిస్తూ ట్రంప చేసిన ట్వీ ట్ అగ్నికి ఆజ్యం పోసినట్లైంది. ట్రంప్ ట్వీట్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనకారులు ఉద్యమిస్తున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా 40 నగరాల్లో కర్ఫ్యూని విధించారు. ఇక జార్జ్ మృతితో చెలరేగిన వివాదం అమెరిరాను అతలాకుతలం చేస్తోంది. పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యా యి. ఇప్పటివరకు కనీసం 20 రాష్ట్రాల్లో 2,564 మంది అరెస్టయ్యారు.
భగ్గుమంటున్న అగ్రరాజ్యం
RELATED ARTICLES