నోడల్ కేంద్రంగా హైదరాబాద్ కోఠి ఇఎన్‌టి ఆస్పత్రి
ప్రజాపక్షం/హైదరాబాద్ :
బ్లాక్ ఫంగస్ మానవాళిపై ప్రమాదకర వ్యాధులు ముప్పేట దాడి చేస్తున్నాయి. కరోనా కల్లోలంతో ఇప్పటికే ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. మరోవైపు ఈ బ్లాక్ ఫంగస్ పంజా విసురుతోంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. బ్లాక్ ఫంగస్ కేసుల చికిత్స కోసం నోడల్ కేంద్రం ఏర్పాటు చేసింది. హైదరాబాద్ కోఠి ఇఎన్‌టి ఆస్పత్రిని నోడల్ కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా నుంచి కోలుకున్న వారిలో కొందిరికే బ్లాక్ ఫంగస్ సమస్య వస్తోందని డైరక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ వెల్లడింది. బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్న వారిలో ఎక్కువగా ఇఎన్‌టి సమస్యలు తలెత్తుతున్నాయని స్పష్టం చేసింది. బ్లాక్ ఫంగస్ నిర్థారణ అయిన కరోనా బాధితులకు గాంధీలో చికిత్స అందించనున్నట్లు డిఎంఇ తెలిపింది. బ్లాక్ ఫంగస్ బాధితులకు పూర్తిగా కోఠి ఇఎన్‌టిలో చికిత్స అందించనున్నట్లు తెలిపింది. బ్లాక్ ఫంగస్‌కు వినియోగించే ఔషధాలు సమకూర్చాలని టిఎస్‌ఎంఐడిసికి ప్రభుత్వం అదేశాలు జారీ చేసింది. కొవిడ్ చికిత్స పొందుతున్న సమయంలో బ్లాక్ ఫంగస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రైవేట్ ఆస్పత్రులకు అదేశాలు జారీ చేసింది. షుగర్ స్థాయిలను నియంత్రించేందుకు అవసరమైతేనే స్టేరాయిడ్లు వాడాలని సూచించింది. బ్లాక్ ఫంగస్ బారిన పడి కంటి వైద్యుడి అవసరం ఉంటే, అలాంటి రోగుల కోసం సరోజినిదేవి కంటి ఆస్పత్రి, ఇఎన్‌టి, గాంధీ ఆస్పత్రుల సూపరిటెండెంట్ పరస్పరం సమన్వయంతో తగిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
బ్లాక్ ఫంగస్ ముప్పేట దాడి
RELATED ARTICLES