టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎల విమర్శ
కాంగ్రెస్‌లో చేరినప్పుడు ఎందుకు రాజీనామా చేయలేదని సూటిప్రశ్న
ప్రజాపక్షం/హైదరాబాద్: టిడిపి నుంచి కాంగ్రెస్‌లో చేరినప్పుడు రేవంత్‌రెడ్డి తన ఎంఎల్‌ఎ పదవికి రాజీనామా ఎందుకు చేయలేదని, స్పీకర్‌కు రాజీనామా లేఖను ఎందుకు ఇవ్వలేదని టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు ప్రశ్నించారు. బ్లాక్ మెయిలింగ్‌కు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి అని, ఓటుకు నోటు కేసులో దొంగ నోటి నుంచి నీతి పలుకులా అని వారు ప్రశ్నించారు. ఎఐసిసి ఇన్‌చార్జ్ మాణిక్ ఠాగూర్‌కు రూ.25 కోట్లు ఇచ్చి పిసిసి పదవి కొనుకున్న రేవంత్‌పైన కాంగ్రెస్ సీనియర్లు కుతకుత ఉడికిపోతున్నారని, ఇదే భాషను రేవంత్ వాడితే చెప్పు దెబ్బలు తినడం ఖాయమని వారు హెచ్చరించారు. తాము రాజ్యాంగ బద్దంగా, పదవ షెడ్యూల్ ప్రకారం టిఆర్‌ఎస్‌లో చేరామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్‌ఎస్‌లో చేరిన ఎంఎల్‌ఎలు గండ్ర వెంకటరమణారెడ్డి, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, పైలెట్ రోహిత్ రెడ్డి టిఆర్‌ఎస్‌ఎల్‌పి కార్యాలయంలో శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి వాడిన భాషకు ఆయనను చట్ట ప్రకారం రాజకీయాల నుంచి నిషేధించవచ్చన్నారు. ఇతర రాష్ట్రాల్లో అక్కడి ఎంఎల్‌ఎలు కాంగ్రెస్‌లో చేరారని, వారిని కూడా రేవంత్ రాళ్లతో కొడుతారా అని ప్రశ్నించారు. తాము రాజ్యాంగ సూత్రాల ప్రకారమే టిఆర్‌ఎస్‌లో చేరినట్టు వివరించారు. తాము కూడా రేవంత్ తరహా మాట్లాడగలమని, కానీ తమకు సంస్కారం అడ్డొస్తోందన్నారు. తొందర పడి మాట్లాడితే రేవంత్ బొక్కబొర్ల పడుతారన్నారు. రేవంత్ గురువైన చంద్రబాబు నుంచి రాజ్యాంగం గురించి తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు.రాజస్థాన్‌లో బిఎస్‌పి ఎంఎల్‌ఎలను చేరిపించుకున్నఆ రాష్ట్ర కాంగ్రెస్‌కు చెం దిన సిఎం అశోక్ గెహ్లాట్‌ను కూడా రేవంత్ రాళ్లతో కొడుతాడా అని ప్రశ్నించారు. దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ రేవంత్ తన ఇంట్లో రెవెన్యూ మాజీ ఉద్యోగులను పెట్టుకుని బ్లాక్ మెయిలింగ్ ముఠాను నడిపిస్తున్నారని ఆరోపించారు. రేవంత్‌వే దొంగ రాజకీయాలు అని, తమవి సేవా రాజకీయాలు అని అన్నారు. సంచలనం కోసం రేవంత్ ఏ గడ్డయినా కరుస్తారన్నా రు. 2018లో తన టికెట్‌ను కూడా అమ్ముకునేందుకు రేవంత్ ప్రయత్నించాడని ఆరోపించారు. ఆర్‌టిఐ చట్టాన్ని రేవంత్ దుర్వినియోగం చేసుకుంటూ పలువురిని వేధిస్తున్నాడని చెప్పారు. పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ రాళ్లతో కొట్టా ల్సి వస్తే ముందుగా ఇన్ని రాజకీయ పార్టీలు మా రిన రేవంత్‌నే కొట్టాలన్నారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం చాలా రాజకీయ పార్టీల్లో విలీనాలు జరిగాయని, రేవంత్ అన్నీ తెలుసుకుని మాట్లాడితే మంచిదని సూచించారు. దిగజారి మాట్లాడితే రేవంత్‌ఖు ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు.
బ్లాక్‌మెయిలింగ్‌కు రేవంత్ బ్రాండ్ అంబాసిడర్
RELATED ARTICLES