పార్లమెంటులో బ్రిటన్ ప్రధాని థెరిసా మేకు చుక్కెదురు
లండన్: బ్రిటన్ ప్రభుత్వ చరిత్రలోనే ఓ సిట్టింగ్ ప్రధానికి ఎన్నడూ ఎదురుకాని పరాజయం ప్రధాని థెరిసా మేకు ఎదురయింది. ఇయూ సమాఖ్య నుంచి బ్రిటన్ వేరుపడ్డానికి చేసుకున్న బ్రెగ్జిట్ ఒప్పందంపై బ్రిటన్ పార్లమెంట్‌లో మంగళవారం నిర్వహించిన చారిత్రక ఓటింగ్‌లో ఆమె ఓటమి పాలయ్యారు. దీంతో ఆమె విశ్వాస పరీక్ష ఎదుర్కోవాల్సి వచ్చింది. యూరోపియన్ యూనియన్ (ఇయూ) నుంచి వైదొలగాలని బ్రిటన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై బ్రిటన్ పార్లమెంట్లో కీలక ఓటింగ్ నిర్వహించారు. బ్రెగిట్‌కు వ్యతిరేకంగా 432 మంది ఓటేయగా, 202 మంది అనుకూలంగా ఓటేశారు. మెజారిటీ సభ్యులు 230 మంది వ్యతిరేకించారు. ఇంత పెద్ద ఓటమి ఆధునికి చరిత్రలో ఏ బ్రిటన్ ప్రధానికి ఎదురవ్వలేదు. దీంతో ఓటింగ్‌లో థెరిస్సా ఓటమి పాలయ్యారు. బ్రెగిట్‌కు అనుకూలంగా ఓటేయాలన్న మే అభ్యర్థనను పార్లమెంటు సభ్యులు పట్టించుకోలేదు.ఓటింగ్‌లో ఓటమి సంభవించిన కొన్ని నిమిషాలకే ప్రతిపక్ష నాయకుడు జెరెమీ కార్బైన్ (లేబర్ పార్టీ) థెరెసా మే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఒకవేళ అవిశ్వాస తీర్మానం నెగ్గితే మెజార్టీ రాజకీయపక్షం విశ్వాస తీర్మానం ఎదుర్కోవాల్సి ఉంటుంది.ఇందుకు 14 రోజుల వ్యవధి ఉంటుంది. గడువులోగా విశ్వాస తీర్మానంలో సదరు పక్షం గెలవకపోతే బ్రిటన్‌లో ఎన్నికలు అనివార్యం కానున్నాయి. ‘వీలయినంతం త్వరగా మీ ఉద్దేశాలను స్పష్టం చేయండి. సమయం మించిపోతోంది’ అంటూ యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు జీన్-క్లాడ్ బ్రిటన్ ప్రభుత్వాన్ని కోరారు. ‘ఇయూలోని 28 దేశాల్లో మిగతా 27 సభ్య దేశాలు ఐక్యంగా ఉన్నాయి’ అని యూరోపియన్ యూనియన్ మండలి అధ్యక్షుడు డొనాల్డ్ టస్క్ చెప్పారు. ‘ఇక తర్వాత ఏమిటో తేల్చాల్సింది బ్రిటన్ ప్రభుత్వమే. యూరోపియన్ యూనియన్ మాత్రం ఐక్యంగానే ఉంటుంది’ అని యూరోపియన్ యూనియన్ తాలూకు బ్రెగ్జిట్ ముఖ్య సంధానకర్త మిషెల్ బార్నియర్ అన్నారు. ‘యూరోప్‌కు ఇది గిట్టని రోజు. మేము ఇప్పటికే సన్నద్ధం అయ్యాం. బ్రెగ్జిట్ దుర్గమం అవ్వడం బ్రిటన్‌కు, యూరోప్ యూనియన్‌కు ఆకర్షణీయంగా లేదు’ అని జర్మనీ అభిప్రాయపడింది. ‘హార్డ్ బ్రెగ్జిట్ చాలా చెత్త ఆప్షన్’ అని జర్మనీ ఆర్థిక మంత్రి, వైస్ ఛాన్సలర్ ఒలఫ్ షాల్జ్ అన్నారు. ‘ఒకవేళ లండన్ కోరిన పక్షంలో గడువును మార్చి 29 తర్వాతకు ఇయూ పొడిగిస్తుంది’ అని ఫ్రాన్స్ యూరోప్ మంత్రి నథాలీ లూయీసౌ అభిప్రాయపడ్డారు. ‘దురదృష్టంకొద్దీ ఈ పరిణామం బ్రెగ్జిట్ డిసార్డర్లీ రిస్క్‌ను పెంచింది. దీని ఫలితంగా ప్రభుత్వం సన్నద్ధతను ఇంకా తీవ్రతరం చేస్తుంది’ అని ఐర్లాండ్ ప్రభుత్వం ప్రకటించింది. ‘ఏది ఎలా ఉన్నప్పటికీ మేము ఉపసంహరణ ఒప్పందంపై మళ్లీ చర్చలు జరపబోం’ అని ఆస్ట్రేలియా ఛాన్సలర్ సెబాస్టియన్ క్రూజ్ ట్వీట్ చేశారు. ‘అక్రమ పద్ధతిలో వెళ్లిపోవడం ఇయూకు నకారాత్మకంగా, ఇంగ్లాండ్‌కు ఉపద్రవంగా మారనున్నది’ అని స్పానిష ప్రధాని పెడ్రో శాంచెజ్ తెలిపారు.
బ్రెగ్జిట్‌పై ఓటింగ్‌లో ఓటమి
RELATED ARTICLES