HomeEntertainmentCinemaబ్యాడ్ గాయ్ ఇన్ లైగర్…వర్కింగ్ స్టిల్స్

బ్యాడ్ గాయ్ ఇన్ లైగర్…వర్కింగ్ స్టిల్స్

Published on Jun 27, 2022 7:04 pm IST

విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఔట్ అండ్ ఔట్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా లైగర్. ధర్మ ప్రొడక్షన్స్ మరియు పూరి కనెక్ట్స్ బ్యానర్ లపై ఈ చిత్రాన్ని కరణ్ జోహార్, పూరి జగన్నాథ్, ఛార్మి, అపూర్వ మెహతా, హిరో యశ్ జోహార్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ను ఆగస్ట్ 25, 2022 న ప్రపంచ వ్యాప్తంగా భారీగా థియేటర్ల లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ మేరకు తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పలు వర్కింగ్ స్టిల్స్ ను ఛార్మి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఈ చిత్రం లో బ్యాడ్ గాయ్ గా నటించిన విషు రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసినట్లు తెలుస్తోంది. విషు, డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఛార్మి, మైక్ టైసన్ లతో ఉన్న ఫోటోలు షేర్ చేయడం జరిగింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రమ్య కృష్ణ, రోనిత్ రాయ్ లు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తుండగా, విక్రమ్ మంట్రోజ్, తనీష్క్ బఘ్చి లు సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా మూవీ గా విడుదల కాబోతున్న ఈ భారీ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments