టాటా ఓపెన్ టెన్నిస్ టోర్నీ
పుణె: భారత స్టార్ రోహన్ బోపన్న ఈ ఏడది తొలి టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. పుణే వేదికగా జరిగిన టాటా ఓపెన్ మహారాష్ట్ర ఎటిపి 250 టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్ టైటిల్‌ను రోహన్ బోపన్న, దివిజ్ శరణ్ జంట కైవసం చేసుకుంది. శనివారం ఇక్కడ జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో బోపన్న, శరణ్ (భారత్) టాప్ సీడ్ జోడీ 6- 6- తేడాతో గ్రేట్ బ్రిటన్‌కు చెం దిన లూకె బాంబ్రిడ్జ్, జానీ ఒమారా ద్వయంపై విజయం సాధించి టైటిల్‌ను సొంతం చేసుకున్నా రు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన బోపన్న జోడీ తొలి సెట్‌లో ప్రత్యర్థి జంటను బోల్తా కొట్టించింది. వీరి ధాటికి ఇంగ్లీష్ ద్వయం 6- మొదటి సెట్‌ను ఓడిపోయింది. తర్వాతి సెట్‌లో కూడా బోపన్న జోడీ దూకుడుగా ఆడింది. అయితే ఈ సెట్‌లో ప్రత్యర్థి జంట నుంచి గట్టి పోటీ ఎదురైంది. అయితే చివర్లో దూకుడును మరింతగా పెంచిన బోపన్న ద్వయం 6- గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా గెలుచుకున్నారు. ఇక ఈ విజయంతో భారత వేటరన్ ఆటగాడు రోహన్ బోప న్న తన ఖాతాలో 18వ ఎటిపి టైటిల్ వేసుకున్నా డు. మరోవైపు దివిజ్ శరణ్‌కి ఇది నాలుగో టైటిల్. భారత స్టార్ బోపన్న కొత్త ఏడాదిని టైటిల్‌తో శుభారంభం చేశాడు.
బోపన్న జోడీకి టైటిల్
RELATED ARTICLES