ముఖ్యమంత్రికి సిపిఐ ఎంపి బినోయ్ విశ్వం లేఖ
ప్రజాపక్షం/వరంగల్ ప్రతినిధి వరంగల్ జిల్లా మామునూరు సమీపంలోని బొల్లికుంట గ్రామంలో గుడిసెలు వేసుకున్న 1200 మంది పేదలపై అమానుషంగా దాడి చేసి గుడిసెలు కూల్చివేసారని, ఈ ఘటనపై విచారణ జరిపి పేదలకు న్యాయం చేయాలని సిపిఐ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, జాతీయ కార్యదర్శి బినోయ్ విశ్వం రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరారు. ఈ మేరకు గురువారం సిఎం కెసిఆర్‌కు లేఖ రాశారు. బొల్లికుంట గ్రామంలో ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతున్నదని, రెవెన్యూ, పోలీసు అధికారులు భూకబ్జాదారులకు వంతపాడుతున్నారని అన్నారు. ఇండ్లు లేని నిరుపేదలు గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారని, వారి గుడిసెలు కూల్చి వేసారని, పేదలను అరెస్టు చేసారని, దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, పేదలకు నష్టపరిహారం అందించాలని కోరారు. వరంగల్ నగరంలోని ఇండ్లు లేని పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తామని చెప్పిన హామీని నెరవేర్చాలని కోరారు.
బొల్లికుంట పేదలకు న్యాయం చేయండి
RELATED ARTICLES