ప్రజాపక్షం/న్యూఢిల్లీ : జాతీయ వనరులను ముఖ్యంగా బొగ్గు గనులను ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా గని కార్మికులు గురువారంనాడు నిరసన తెలియజేశారు. మూడు రోజుల నిరసన కార్యక్రమంలో భాగంగా తొలిరోజు గనికార్మికులు దాదాపు దేశవ్యాప్తంగా వున్న బొగ్గు గనుల్లో ఆందోళనలు చేపట్టారు. బొగ్గు రంగంలో మొద టి రెండు షిఫ్టుల్లో సమ్మె నూటికి నూరు శాతం విజయవంతమైందని గని కార్మికుల ఆందోళనకు మద్దతునిస్తున్న పది కేంద్ర కార్మిక సంఘా లు ఒక సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. ఈ సమ్మెకు ఎఐటియుసి, ఐఎన్‌టియుసి, హెచ్‌ఎంఎస్, సిఐటియు, ఎఐటియుటియుసి, టియుసిసి, ఎస్‌ఇడబ్ల్యు, ఎఐసిసిటియు, ఎల్‌పిఎఫ్, యుటియుసిలు సంఘీభావం తెలియజేశాయి. జాతి ప్రయోజనాల దృష్ట్యా బొగ్గు రం గాన్ని పరిరక్షించడమే ధ్యేయంగా కార్మికులు ఈ మూడు రోజుల సమ్మెకు పూనుకోవాల్సి వచ్చిందని ఎఐటియుసి ప్రధాన కార్యదర్శి అమర్‌జీత్‌కౌర్ తెలిపారు. బొగ్గు పరిశ్రమలో మై నింగ్ వ్యాపారీకరణ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని, సిఐఎల్, లేదా ఎస్‌సిసిఎల్ ప్రైవేటీకరణ దిశగా చర్యలను నిలుపుదల చేయాలని, సిఐఎల్ నుంచి సిఎంపిడిఐఎల్‌ను విడదీయాలన్న నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే సిఐఎల్, ఎస్‌సిసిఎల్‌లలో ఒప్పంద కార్మికుల వేతనాలను తక్షణమే పెంచాలని కోరారు. జాతీయ బొగ్గు వేతన ఒప్పందంలోని 9.3.0, 9.4.0, 9.5.0 క్లాజులను కచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. బొగ్గు గనుల్లో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఆహ్వానం చెప్పాలన్న ప్రభుత్వ విధానాన్ని బొగ్గు యూనియన్లతోపాటు పది కేంద్ర కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. తొలి రోజు బొగ్గు సమ్మెను విజయవంతం చేసిన కార్మికులకు కేంద్ర కార్మిక సంఘాలు అభినందనలు తెలిపాయి. తెలంగాణ రాష్ట్రంలో విస్తరించి ఉన్న సింగరేణి కాలరీస్‌లో కొత్తగూడెం, భూపాలపల్లి, గోదావరిఖని ప్రాంతాల్లో కార్మికులు ధర్నాలు నిర్వహించారు. సింగరేణి కేంద్ర, ఉప కార్యాలయాల ముందు ఆందోళనలు చేపట్టారు.
బొగ్గు గని కార్మికుల నిరసన
RELATED ARTICLES