నలుగురు కార్మికులు మృతి
మంచిర్యాల జిల్లాలోని ఎస్‌ఆర్‌పి 3 గనిలో ప్రమాదం
ప్రజాపక్షం/మంచిర్యాల క్రైం మంచిర్యాల జిల్లాలోని ఎస్‌ఆర్‌పి 3 గనిలో ప్రమాదం చోటుచేసుకుంది. బొగ్గుగని పై కప్పు కూలి నలుగురు కార్మికులు మృత్యువా త పడ్డారు. ఉదయం విధుల నిమిత్తం భూ గర్భ గనిలోపలకి వెళ్ళిన కార్మికులు కృష్ణారెడ్డి, లక్ష్మయ్య, సత్యనర్సింహ్మరాజు, చంద్రశేఖర్ ప్రమాదంలో మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఎస్‌ఆర్‌పి 3 21 డీప్ 24 లెవల్ వద్ద రూఫ్ వాల్ కూలడంతో జరిగిన ప్రమాదంలో కార్మికులు మృతి చెందినట్లు తెలుస్తుందన్నారు. గనిలో ఉన్న మిగిలిన కార్మికులను బయటకు తీసుకువచ్చేందుకు గనిలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని తెలిపారు. ఘటనాస్థలిలో శిథిలాల కింద మరింత మంది కార్మికులు ఉండే అవకాశం ఉందని గని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులుమృతి చెందడంతో గని వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అయితే కొంత మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చి రామకృష్ణపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
కోటి రుపాయల నష్టపరిహారం చెల్లించాలి
గని ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు సింగరేణి యాజమాన్యం ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఎస్‌ఐజికెఎస్ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి సబ్బని కృష్ణ డిమాండ్ చేశారు. సింగరేణి యాజమాన్యం ఉత్పత్తిపై చూపిస్తున్న శ్రద్ధ కార్మికుల రక్షణ పై, ప్రాణాలపై చూపడం లేదని, ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని అన్నారు.
బొగ్గుగని పైకప్పు కూలి
RELATED ARTICLES