దేశవ్యాప్తంగా నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి
నూటికి నూరు శాతం సమ్మె విజయవంతం : కార్మికసంఘాలు
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా బొగ్గ గని కార్మికులు సమ్మె చేయడంతో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. నూటికి నూరు శాతం కార్మికులు ఈ సమ్మెలో పాల్గొనడంతో సమ్మె సంపూర్ణంగా విజయవంతమైంది. బొగ్గు గనుల్లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ)కు అనుమతినివ్వాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా బొగ్గు గని కార్మికులు మంగళవారంనాడు ఒక రోజు సమ్మె నిర్వహించారు. కోల్ ఇండియా లిమిటెడ్, సింగరేణి కేలరీస్ కంపెనీ లిమిటెడ్‌లకు చెందిన అన్ని గనుల్లోనూ బొగ్గు ఉత్పిత్తి, సరఫరా పూర్తిగా నిలిచిపోయిందిన పది కేంద్ర కార్మిక సం ఘాలు ప్రకటించాయి. ఈ మేరకు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న కోల్ ఇండియా, సింగరేణి కాలరీస్‌ల లో పనిచేస్తున్న ఒప్పంద కార్మికులతోపాటు 5 లక్షల మందికి పైగా కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. ప్రభుత్వం తక్షణమే తన ఎఫ్‌డిఐల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. “బిఎంఎస్ మినహా మిగిలిన అన్ని యూ నియన్లు త్వరలోనే సమావేశమై, తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాయి. ఈరోజు అస్సాం నుంచి సింగరేణి వరకు అన్ని గనుల్లో బొగ్గు ఉత్పత్తి, రవాణా, సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో సమ్మె పరిపూర్ణమైంది” అని ఆలిండియా కోల్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి డి.డి.రామనందన్ పిటిఐకి తెలిపారు. ఎఐటియుసి కేంద్ర కమిటీ అధ్యక్షులు, మాజీ ఎంపీ రమేంద్ర కుమార్ సమ్మెపై స్పందిస్తూ, కోల్ ఇండియా అనుబంధంగా పనిచేస్తున్న బొగ్గు గని కార్మికులంతా జాతీయ సమ్మెలో పాల్గొన్నారని, ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇదొక అదిపెద్ద నిరసనగా అభివర్ణించారు. సమ్మె విజయవంతమైందని, ఎస్‌సిసిఎల్‌కు చెందిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కూడాఈ సమ్మెలో పాల్గొన్నట్లు ఇండియన్ నేషనల్ మైన్‌వర్కర్స్ ఫెడరేషన్ (ఐఎన్‌ఎంఎఫ్) ప్రధాన కార్యదర్శి ఎస్‌క్యు జమా తెలిపారు. దేశవ్యాప్తంగా బొగ్గు ఉత్పాదకతకు సంబంధించి 80 శాతం వరకు మంగళవారం ఎలాంటి కదలికలు లేవు. ఈ సమ్మె కారణంగా ఒక్క రోజులో 1.5 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయిన మాట వాస్తవమేనని కోల్ ఇండియా అధికారులు ప్రకటించారు. అయితే తుది గణాంకాలు ఇంకా వెలువడాల్సివుందని చెప్పారు. కోల్ ఇండియాలో తొలి షిఫ్ట్‌లో పాలక, కార్యనిర్వాహక ఉద్యోగులను కలుపుకొని మొత్తంగా 30 శాతం మంది మాత్రమే హాజరయ్యారని సిఐఎల్ అధికారి ఒకరు తెలిపారు. పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు యూనియన్లతో చర్చించేందుకు ప్రయత్నిస్తున్నామని కేంద్ర బొగ్గు గని శాఖ మంత్రి ప్రహ్లాద్‌జోషి విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ రోజు బొగ్గు ఉత్పత్తిపై పెద్ద ప్రభావం పడిందని, చర్చలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ తలుపులు తెరిచే వుంటుందని చెప్పారు. బొగ్గు గనుల్లో ఎఫ్‌డిఐల అనుమతి పట్ల కేంద్ర కార్మిక సంఘాలు నిరసన తెలియజేస్తూనే వున్నాయి. దీనిపై చర్చించేందుకు కేంద్ర మంత్రి జోషి ఆహ్వానించినప్పటికీ, గత వారం సంఘాలు తిరస్కరించాయి. నిర్ణయం ఉపసంహరణ తప్ప వేరే ప్రస్తావనలేమీ వుండబోవని కార్మిక సంఘాలు స్పష్టంచేశాయి. కేంద్రంతో చర్చలు అవసరం లేదని, నిర్ణయం ఉపసంహరణ ఒక్కటే తమ అంతిమ డిమాండ్ అని తేల్చిచెప్పాయి. జార్ఖండ్‌లోని సిసిఎల్ (సెంట్రల్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్)లోనూ సాధారణ కార్యకలాపాలన్నీ స్తంభించిపోయాయి. సమ్మెతో తీవ్రంగా నష్టం వాటిల్లిందని, అయితే ఈ నష్టాన్ని అదనపు పనిగంటల ద్వారా భర్తీ చేస్తామని సిసిఎల్ డైరెక్టర్ (పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేషన్) ఆర్‌ఎస్ మహాపాత్ర తెలిపారు. సమ్మెకు సారథ్యం వహించిన కేంద్ర కార్మిక సంఘాల్లో ఇండియన్ మైన్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎఐటియుసి), ఆలిండియా కోల్ వర్కర్స్ ఫెడరేషన్ (సిఐటియు), ఆలిండియా సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ (ఎఐసిసిటిసి), హింద్ ఖాదాన్ మజ్దూర్ ఫెడరేషన్ (హెచ్‌ఎంఎస్), ఇండియన్ నేషనల్ మైన్‌వర్కర్స్ ఫెడరేషన్ (ఐఎన్‌టియుసి)లు వున్నాయి. ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంఘమైన భారతీయ మజ్దూర్ సంఘ్ (బిఎంఎస్) మాత్రం ఈ సమ్మెలో పాల్గొనలేదు.
సింగరేణిలో సమ్మే విజయవంతం..
ప్రజాపక్షం/జయశంకర్ భూపాలపల్లి ప్రతినిధి : ఉద్యమాల ద్వారానే కార్మికులు తమ హక్కులను సాధించుకోగలుతారని సింగరేణిలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపటట్టిన దేశవ్యాప్త సమ్మే అందరి కార్మికుల కృషి ఐక్యత వల్ల భూపాలపల్లి విజయవంతమమైందని ఎఐటియుసి నాయకులు కొరిమి రాజ్ కుమార్ అన్నారు. సింగరేణిలో దేశవ్యాప్తంగా చేపట్టిన చారిత్రక సమ్మే విజయవంతమైందని కార్మికుల ఐక్యతకు ఇదే నిదర్శనమని ఎన్నడూ లేనివిధంగా సింగరేణిలో ఈనాటి సమ్మే చరిత్రలో నిలిచి పోతుందన్నారు. భూపాలపల్లి సింగరేణి వ్యాప్తంగా పూర్తిగా కార్ముకులు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కార్మిక వ్యతిరేక విధంగా కార్మికులు సమ్మే ద్వారా నిరసనలు తెలపడం జరుగుందని అన్నారు. సమమ్మేలో పాల్గొన్న కార్మికులందరికి విప్లవ అభినందనలు తెలియచేస్తున్నాము. సమ్మేను విజయవంతం చేసి కార్మిక హక్కుల సాధనలో ముందున్న కార్మిక వర్గానికి విప్లవ జేజేలు అలాగే జాతీయ కార్మిక సంఘాలతో పాటు కలిసొచ్చిన మిగితా సంఘాలకు, టిబిజికేఎస్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.అలాగే కొంతమంది అత్యవసర సిబ్బందితో పాటు మరికొంత మంది పూటకు లేని కార్మికులు కూడా డ్యూటీ చేస్తున్నారు. వారికి మేము (సమ్మే చేసే కార్మికులం) వారి వంతు సమ్మే చేసిన సరే వారిని ఆర్థికంగా ఆదుకుంటామని భరోసా ఇస్తున్నాం. అలాగే కోల్ ఇండియాలో అత్యవసర సిబ్బంది కూడా సమ్మేలో పాల్గొన్నారు. ఒక హస్పిటల్ తప్ప మిగితా ఏ ఒక్క కార్మికుడు డ్యూటీకి వెల్లకపోవడం వారిత ఐక్యతకు నిదర్శనం వారికి మా అభినందనలు ఇలాంటి ఐక్యత వర్ధిల్లాలని కోరుకుంటున్నామని అన్నారు.
బొగ్గుగని కార్మికుల సమ్మె
RELATED ARTICLES