లండన్: ప్రొఫెషనల్ క్రికెటర్స్ అసోసియేషన్ (పిసిఎ) అందించే ‘ప్లేయర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ గెలుచుకున్నాడు. ఇంగ్లాండ్ ప్రపంచకప్ విజేతగా నిలవడంలో స్టోక్స్ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన యాషెస్ మూడో టెస్టులోనూ 135* పరుగులతో జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో అవార్డుకు నామినేషన్లగా ఎంపికైన వారిలో స్టోక్స్ విజేతగా నిలిచాడు.’ పీసీఏ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. వ్యక్తిగతంగా ఎంతో గర్వంగా కూడా ఉంది. జట్టు నాకు అండగా నిలిచినందుకే ఈ అవార్డును అందుకోగలుగుతున్నాను. 2019 ఎంతో ప్రత్యేకమైంది. మేము విశ్వవిజేతగా నిలవడంతో పాటు యాషెస్ సిరీస్‌ను సమం చేశాం’ అని స్టోక్స్ పేర్కొన్నాడు. పీసీఏ సమ్మర్ వన్డే ప్లేయర్‌గా క్రిస్ వోక్స్, టెస్టు ప్లేయర్‌గా స్టువర్ట్ బ్రాడ్, కౌంటీ ఛాంపియన్‌షిప్ ప్లేయర్‌గా హార్మర్, ఉమెన్ ప్లేయర్‌గా సోఫీ ఎక్లెస్టన్ ఎంపికయ్యారు. ’యంగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్’గా టామ్ బాంటన్ నిలిచాడు.
బెన్‌స్టోక్స్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు
RELATED ARTICLES