ముంబయి: ప్రొకబడ్డీ ఏడో సీజన్‌లో బెంగాల్ వారియర్స్ ఎట్టకేలకు రెండో విజయాన్ని నమోదు చేసింది. పుణెరి పల్టాన్‌పై 43-24 తేడాతో ఘన విజయం సాధించింది. బంగాల్ వీరుడు మణిందర్ సింగ్ 16 సార్లు కూతకెళ్లి 14 పాయింట్లు అందించాడు. 5 పాయింట్లతో రింకూ నర్వాల్ టాప్ డిఫెండర్‌గా నిలిచాడు. మహ్మద్ నబీభక్ష్ (8) సత్తా చాటాడు. మ్యాచ్ సాంతం పుణెపై బంగాల్ ఆధిపత్యం చాటింది. 22 రైడ్ పాయింట్లతో చెలరేగింది. మూడుసార్లు ప్రత్యర్థిని ఆలౌట్ చేసింది. పుణె రైడింగ్‌లో కేవలం 13 పాయింట్లే సాధించింది. అంతకు ముందు తమిళ్ తలైవాస్, పట్నా పైరేట్స్ మధ్య నువ్వానేనా అన్నట్టు మ్యాచ్ జరిగింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో పట్నా 43-24 తేడాతో పుణెరిని ఓడించింది. మ్యాచ్‌లో డిఫెండర్లు హవా కొనసాగించారు. దీంతో తలైవాస్ ఆటగాడు రాహుల్ చౌదరి 14 సార్లు కూతకు వెళ్లి కేవలం 5 పాయింట్లే తెచ్చాడు. పట్నాలో పోస్టర్ బాయ్ పర్దీప్ నర్వాల్ అయితే కేవలం 1 పాయింట్‌కే పరిమితం అయ్యాడు. తలైవాస్ రైడింగ్‌లో, పట్నా ట్యాకిలింగ్‌లో ఆధిపత్యం చాటాయి.
బెంగాల్ వారియర్స్ విజయం
RELATED ARTICLES