విశాఖపట్నం: గ్రూప్ ‘బి’లో భాగంగా జరిగిన మరోక రంజీ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్ జట్టు బెంగాల్ జట్టుతో డ్రా చేసుకుంది. 203 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్రప్రదేశ్ చివరి రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. దీంతో ఈ మ్యాచ్ ఫలితం తేలకుండా డ్రా అయింది. ప్రశాంత్ కుమార్ (90; 81 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి ఆంధ్రాను ఆదుకున్నాడు. మరోవైపు జ్యోతి కృష్ణ (45) ఇతనికి అండగా నిలిచాడు. తర్వాతి బ్యాట్స్‌మెన్స్ వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఆంధ్ర జట్టు 28 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. ప్రత్యర్థి బౌలర్లలో అశోక్ దిండా మూడు వికెట్లు పడగొట్టగా.. ఇషాన్ పొరెల్, ముకుష్ కుమార్ తలో రెండు వికెట్లు దక్కించుకున్నారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన బెంగాల్ జట్టు 40.3 ఓవర్లలో 223/7 పరుగులు వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. బెంగాల్ బ్యాట్స్‌మన్లలో ఈశ్వరణ్ (57), సుదీప్ చటర్జీ (47), బిజోయ్ చటర్జీ (40 నాటౌట్) రాణించారు. ఆంధ్ర బౌలర్లలో విజయ్ కుమార్, పృథ్విరాజ్ చెరో రెండు వికెట్లు తీశారు. అంతకుముందు బెంగాల్ మొదటి ఇన్నింగ్స్‌లో 300 పరుగులు చేస్తే బదులుగా ఆంధ్రప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 321 పరుగులు చేసి స్వల్ప ఆధిక్యంతో మూడు పాయింట్లు దక్కించుకుంది.
బెంగాల్‌తో ఆంధ్రా డ్రా
RELATED ARTICLES