సింధు గెలిచినా.. సెమీస్‌లో హైదరాబాద్ హంటర్స్ ఓటమి, బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్
బెంగళూరు: బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్ (పిబిఎల్)లో హైదరాబాద్ హంటర్స్‌కు షాక్ తగిలింది. శనివారం ఇక్కడ జరిగిన రెండో సెమీఫైనల్లో ముంబయి రాకెట్స్ (4 తేడాతో హైదరాబాద్ హంటర్స్‌ను ఓడించి ఫైనల్లో దూసుకెళ్లింది. స్టార్ షట్లర్ పివి సింధు గెలిచినా ఫలితం లేకుండా పోయింది. ఇతర ఆటగాళ్లు నిరాశపరచడంతో హైదరాబాద్ సెమీస్‌లోనే ఇంటి ముఖం పట్టింది. మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో సింధు (హైదరాబాద్ హంటర్స్) 15- 15 తేడాతో పరదేశి (ముంబయి రాకెట్స్)ను వరుస గేమ్‌లలో ఓడించింది. ఇక ముంబయి రాకెట్స్ తరఫున పురుషుల సింగిల్స్‌లో సమీర్ వర్మ, అంటన్‌సెన్, పురుషుల డబుల్స్‌లో కె.జి.జాంగ్ జోడీ విజయాలు సాధించారు. శుక్రవారం జరిగిన తొలి సెమీస్‌లో బెంగళూరు రాప్టర్స్ (4 అవధే వారియర్స్‌పై విజయం సాధించి ఫైనల్లో ప్రవేశించిన విషయం తెలిసిందే. తాజాగా రెండో సెమీ ఫైనల్లో గెలిచిన ముంబయి రాకెట్స్ ఫైనల్లో దూసుకెళ్లింది. ఆదివారం జరిగే ఫైనల్ పోరులో బెంగళూరు రాప్టర్స్‌తో అమీతుమీకి ముంబయి రాకెట్స్ సిద్ధమయింది.
బెంగళూరు రాప్టర్స్ ఢీ
RELATED ARTICLES