ప్రజాపక్షం / హైదరాబాద్ ముఖ్యమంత్రి కెసిఆర్ గురువారం ఉదయం బెంగుళూరుకు వెళ్లనున్నారు. భారత మాజీ ప్రధాని దేవెగౌడతో ఆయన నివాసంలో మధ్యాహ్నం భేటీ కానున్నారు. దేశ ప్రస్తుత రాజకీయాలు, ఇతర సమకాలీన అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరగనున్నట్లు టిఆర్‌ఎస్ వర్గాల సమాచారం. ఈ లంచ్ సమావేశంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, దేవెగౌడ తనయుడు కుమారస్వామి కూడా పాల్గొంటారు. బెంగళూరు పర్యటన సందర్భంగా సిఎం కెసిఆర్‌కు ఘన స్వాగతం పలుకుతూ పద్మనాభనగర్‌లోని దేవెగౌడ ఇంటి పరిసరాల్లో అభిమానులు ముఖ్యమంత్రి కెసిఆర్ కటౌట్లను ఏర్పాటు చేశారు.
బెంగళూరుకు సిఎం కెసిఆర్
RELATED ARTICLES