ప్రజాభిమానంతోనే ఎన్నికల్లో టిఆర్‌ఎస్ గెలుపు
కొత్తవి సహా 33 జిల్లాల్లో తెలంగాణ భవన్‌ల నిర్మాణం
టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు
హన్మకొండలో పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన
ప్రజాపక్షం/ వరంగల్ బ్యూరో ; ప్రజల అభిమానంతోనే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ భారీ విజయం సాధించిందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు అన్నారు. గురువారం హన్మకొండలోని బాలసముద్రంలో టిఆర్‌ఎస్ వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల కార్యాలయాలకు కెటిఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానిక కెడిసి గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ సాధించిన పార్టీగా 2014 ఎన్నికల్లో 63 స్థానాల ను కట్టబెట్టిన ప్రజలు, ఈసారి మరింత అభిమానంతో 88 స్థానా లు అందించారన్నారు. ఈ ఎన్నికల్లో ఎవరెన్ని గ్రూ పులు కట్టి దాడి చేసినా, గతం కంటే పోలింగ్ శాతం పెరిగినా తమకు అనుకూలంగా ప్రజలు వెల్లువలా ఓటు వేశారని, మొత్తం ఓట్లలో 47 శాతం టిఆర్‌ఎస్‌కు పడ్డాయని, ప్రజాకూటమికి 52 లక్షల ఓట్లు పడితే టిఆర్‌ఎస్‌కు 98 లక్షల ఓట్లు వేశారన్నారు. ఇక బిజెపికి రాష్ట్రంలో 103 స్థానాల్లో డిపాజిట్‌లు కూడా దక్కలేదన్నారు. ఇం తటి ఘన విజయాన్ని అందించిన ప్రజలకు కెసిఆర్ పట్ల దృఢ విశ్వాసం ఉందనేది స్పష్టమైందని, అయినా తెలంగాణ ఇంటి పార్టీగా టిఆర్‌ఎస్‌ను ప్రజలకు చేరువ చేయాల్సి ఉందని చెప్పారు. పార్టీ కంటే ముఖ్యులెవరూ ఉండరని, పార్టీ తల్లిలాంటిదని, టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పార్టీ కేంద్ర కార్యాలయంలో తాను అందుబాటులో ఉంటానని చెప్పారు. జిల్లాల్లోనూ ఎంపిలు, ఎంఎల్‌ఎలు, ఎం ఎల్‌సిలు పార్టీ కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలని, తెలంగాణలో రానున్న రోజుల్లో కొత్తగా ఏర్పాటయ్యే రెండు సహా 33 జిల్లాల్లో తెలంగాణ భవన్ పేరిట పార్టీ కార్యాలయాలను నిర్మిస్తామని, ప్రతి జిల్లాల్లో కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తూ అన్ని విభాగాలను దృఢంగా తయారు చేస్తామని, బూత్ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. వచ్చే జనవరి నుండి జూన్ వరకు రాష్ట్రంలో ఎన్నికల వాతావరణమేనని, వార్డు సభ్యుడి నుండి, పార్లమెంట్ ఎన్నికల దాకా కార్యకర్తలు ఎన్నికల్లో నిమగ్నం కావాలని కోరారు. వరంగల్‌తో తనకు విడదీయరాని అనుబంధం ఉందని, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జిల్లా వరంగల్ అని,