కంగారులకు బెంబెలెత్తించాడు
ఆరు వికెట్లతో చెలరేగిన జస్ప్రీత్
ఆస్ట్రేలియా 151 ఆలౌట్.. భారత్ రెండో ఇన్నింగ్స్ 54/5
ప్రస్తుతం టీమిండియా ఆధిక్యం 346.. మూడో టెస్టు
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో భారత బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (6/33) విజృంభించడంతో ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 151 పరుగులకే కుప్పకూలింది. ఇతని ధాటికి ఆస్‌స్ బ్యాట్స్‌మెన్స్ విలవిలలాడారు. తర్వాత రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా శుక్రవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 54 పరుగులు చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 443/7 పరుగుల వద్ద డిక్లేర్డ్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి భారత్ 346 పరుగుల ఆధిక్యంలో ఉంది. శనివారం నాలుగో రోజు భారత్ 400 మార్కును దాటుతుందని అందరూ అంచనా వేస్తున్నారు. మయాంక్ అగర్వాల్ (28 బ్యాటింగ్), రిషభ్ పంత్ (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఇప్పటికీ భారత్, ఆస్ట్రేలియా చెరొక్క మ్యాచ్ గెలిచి నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 1- సమంగా ఉన్నారు. అయితే ఈ మ్యాచ్‌లో పట్టు బిగించిన టీమిండియా భారీ విజయం సాధించే అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ చెసిన సగం స్కోరును కూడా చేయలేని ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో కూడా భారత్ నిర్ధేశించే భారీ టార్గెట్‌ను అందుకోవడం కష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం పిచ్ ఫాస్ట్ బౌలింగ్‌కు సహకరిస్తోంది. శుక్రవారం ఒక్క రోజులోనే మొత్తం 15 వికెట్లు పడ్డాయి. తొలి రెండు రోజులు బ్యాటింగ్‌కు సహకరించిన పిచ్ మూడో రోజు మాత్రం భిన్నంగా మారి బౌలర్లకు సహకరిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో రికార్డులు సృష్టించిన భారత టాప్ ఆర్డర్ రెండో ఇన్నింగ్స్‌లో 50 పరుగులకే ఇంటి ముఖం పట్టడం ఇందుకు నిదర్శనం. ఏది ఏమైన ప్రస్తుతం భారత్‌కు విజయ అవకాశాలు అధికంగా ఉన్నాయి. మరోవైపు ఆసీస్ విజయం సాధించాలంటే చెమటోడ్చాల్సిందే.. ఈ పిచ్‌పై దాదాపు 400 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం అంత సులువుకాదని విశ్లేషకులు చెబుతున్నారు. తొలి ఇనింగ్స్‌లో చెలరేగిన భారత బౌలర్లు రెండో ఇన్నింగ్స్‌లో కూడా తమ ప్రతాపాన్ని చూపెడితే విజయం మనకు మరింత సులువు అవుతుందని జట్టు యాజమాన్యం భావిస్తోంది. బుమ్రా రికార్డు బౌలింగ్‌తో ఆసీస్‌ను హడలెత్తించాడు. టెస్టుల్లో తన కెరీర్ బెస్ట్ గణంకాలను నమోదు చేస్తూ మరెన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
39 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన బుమ్రా
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. టెస్టుల్లో అరంగేట్రం చేసిన తొలి ఏడాది అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్ల జాబితాలో మొదటి స్థానంలో చేరి కొత్త చరిత్ర సృష్టించాడు. ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న బుమ్రా ఆసీస్‌తో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో 6 వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు. ఇతని ధాటికి ఆసీస్ 151 పరుగులకే కుప్పకూలింది. కాగా ఈ ఏడాది భారత్ తరఫున టెస్టుల్లో (44) వికెట్లు తీసిన బుమ్రా అరంగేట్రం టెస్టులో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. 39 ఏళ్ల క్రితం దిలీప్ జోషి నెలకొల్పిన రికార్డును తాజాగా బుమ్రా అధిగమించాడు. 1979లో టెస్టులో అరంగేట్రం చేసిన దిలీప్ జోషి (40) వికెట్లు తీసి భారత్ తరఫున అగ్ర స్థానంలో నిలిచారు. అయితే ఇప్పుడు దాదాపు 39 ఏళ్ల తర్వాత బుమ్రా (44) వికెట్లతో ఆ రికార్డును చెరిపేసి మొదటి స్థానం కైవసం చేసుకున్నాడు. అరంగేట్రంలో ఏడాదిలో నరేంద్ర హిర్వాణి (36) వికెట్లు, 1996లో వెంకటేశ్ ప్రసాద్ (37) వికెట్లు తీశారు.
బుమ్ బుమ్ బుమ్రా..

RELATED ARTICLES