హ్యూస్టన్: అమెరికా 41వ అధ్యక్షుడు జార్జ్ హెచ్.డబ్ల్యు.బుష్(94)కు వాషింగ్టన్‌లోని నేషనల్ కేథడ్రల్ బుధవారం రాజలాంఛనాలతో సంస్కరణలు, తర్వాత టెక్సాస్‌లో గురువారం ఖననం నిర్వహించనున్నారు. సీనియర్ బుష్ పార్కిన్సన్ వ్యాధితో శుక్రవారం కన్నుమూశారు. బుధవారాన్ని జాతీయ శోక దినంగా ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాయుసేన విమానాన్ని సోమవారం టెక్సాస్‌కు పంపనున్నారు. ఆయన పార్థీవ శరీరాన్ని విమానంలో వాషింగ్టన్కు తేనున్నారు. జార్జ్ బుష్‌కు రెండు అంత్యక్రియలు జరగనున్నాయి. ఒకటి నేషనల్ కేథడ్రల్‌లో జరిగే ప్రభుత్వ అంత్యక్రియ, రెండోది హ్యూస్టన్‌లోని సెయింట్ మార్టిన్స్ ఎపిస్కోపల్ చర్చిలో జరిగే స్థానిక అంత్యక్రియ. ప్రభుత్వ అంత్యక్రియ బుధవారం ఉదయం, సాధారణ అంత్యక్రియలు గురువారం ఉదయం హ్యూస్టన్‌లో జరగనున్నాయి. ట్రంప్ మాజీ అధ్యక్షుడు జూనియర్ బుష్‌కు శనివారం ఉదయం సంతాపం కూడా తెలిపారు. మెమోరియల్ సర్వీసెస్ కోసం హ్యూష్టన్ నుంచి వాషింగ్టన్కు బుష్ శవపేటిక(కాస్కెట్)ను తేడానికి వాయుసేన విమానాన్ని ఉపయోగించనున్నట్లు ట్రంప్ తెలిపారు.
బుధ, గురువారాల్లో సీనియర్ బుష్ అంత్యక్రియలు
RELATED ARTICLES